News February 6, 2025
ఆహార సరఫరాలో అవకతవకలు జరిగితే సమాచారం ఇవ్వండి

రేషన్, హాస్టల్స్ లో ఆహారం సరఫరాలో ఎక్కడైనా అవకతవకలు జరిగితే ప్రజలు ఫుడ్ కమిషన్ వాట్సాప్ నంబర్ 9490551117 కి వీడియోల ద్వారా ఫిర్యాదు చేయవచ్చని ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిషన్ ఛైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి వెల్లడించారు. బుధవారం గూడూరు పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలు, హాస్టల్స్ను ఆయన తనిఖీ చేశారు. విద్యార్థులను ఆహార నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట తహశీల్దార్ చంద్రశేఖర్, సీడీపీఓ మెహబూబి ఉన్నారు.
Similar News
News December 1, 2025
నందికొట్కూరు ఎమ్మెల్యేను కలిసిన డిప్యూటీ ఎంపీడీవోలు

నందికొట్కూరు నియోజకవర్గంలో కొత్తగా నియమితులైన డిప్యూటీ ఎంపీడీవోలు నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్యను సోమవారం కలిశారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో నందికొట్కూరు డిప్యూటీ ఎంపీడీవో పాండురంగారెడ్డి, మిడుతూరు ఎంపీడీవో సురేశ్ కుమార్, పగిడ్యాల ఎంపీడీవో మన్సూర్ బాషా, జూపాడుబంగ్లా ఎంపీడీవో మోహన్ నాయక్, పాములపాడు ఎంపీడీవో తిరుపాలయ్య, కొత్తపల్లి ఎంపీడీవో పీఎస్ఆర్ శర్మ ఉన్నారు.
News December 1, 2025
టీటీడీలో అన్యమతస్తులపై నివేదిక తయారీ

టీటీడీలో అన్యమతస్తుల అంశం మరోసారి తెర పైకి వచ్చింది. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీలో ఇంకా ఎవరైనా ఆన్యమతస్తులు ఉంటే వారిని గుర్తించి తదుపరి చర్యల నిమిత్తం నివేదిక తయారు చేయాలని ఆదేశించారు.
News December 1, 2025
సంగారెడ్డి: జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజావాణి

జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఎస్పీ పారితోష్ పంకజ్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మొత్తం 14 మంది సమస్యలు విన్నవించినట్లు ఎస్పీ తెలిపారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలని సంబంధిత స్టేషన్ ఎస్ఐలకు ఎస్పీ ఆదేశించారు.


