News February 6, 2025

ఆహార సరఫరాలో అవకతవకలు జరిగితే సమాచారం ఇవ్వండి

image

రేషన్, హాస్టల్స్ లో ఆహారం సరఫరాలో ఎక్కడైనా అవకతవకలు జరిగితే ప్రజలు ఫుడ్ కమిషన్ వాట్సాప్ నంబర్ 9490551117 కి వీడియోల ద్వారా ఫిర్యాదు చేయవచ్చని ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిషన్ ఛైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి వెల్లడించారు. బుధవారం గూడూరు పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలు, హాస్టల్స్‌ను ఆయన తనిఖీ చేశారు. విద్యార్థులను ఆహార నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట తహశీల్దార్ చంద్రశేఖర్, సీడీపీఓ మెహబూబి ఉన్నారు.

Similar News

News February 12, 2026

మెదక్: ఓటు వేసేందుకు రాష్ట్రం దాటాడు

image

ఓటుపై తనకున్న బాధ్యతను చాటుకున్నాడో యువకుడు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మెదక్ పట్టణంలోని 22వ వార్డుకు చెందిన రవితేజ(26) ఏపీలోని తెనాలి నుంచి వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. అక్కడ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న రవితేజ, తన విలువైన ఓటును వేసేందుకు రాష్ట్రం దాటి సొంతూరికి చేరుకున్నాడు. ఈ యువకుడి చొరవను పలువురు అభినందించారు.

News February 12, 2026

గెలుపు కోసం గట్టి ప్లాన్లు!

image

ఉమ్మడి అనంతపురం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి మొదలైంది. త్వరలో ఎన్నికలు రానున్నాయన్న సమాచారంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. 2021లో కోవిడ్ గందరగోళం, టీడీపీ నామమాత్రంగా పోటీలో ఉండటంతో తాడిపత్రి మినహా అన్ని మున్సిపాలిటీలను వైసీపీ దక్కించుకుంది. ఈసారీ స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా YCP పట్టుదలగా ఉండగా, కూటమి పార్టీలు సైతం పక్కా ప్రణాళికతో బరిలోకి దిగుతున్నాయి.

News February 12, 2026

మహాశివరాత్రి వేళ.. కర్నూలు ఎస్పీ హెచ్చరిక

image

మహాశివరాత్రి సందర్భంగా ఆలయాల పేరుతో నకిలీ వెబ్‌సైట్లు, యాప్‌ల ద్వారా మోసాలు జరిగే అవకాశం ఉందని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. దర్శన టికెట్లు, వసతి గదుల బుకింగ్ కోసం అధికారిక వెబ్‌సైట్లు మాత్రమే ఉపయోగించాలని సూచించారు. అనుమానాస్పద లింకులు క్లిక్ చేయకూడదన్నారు. OTPలు, బ్యాంక్ వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దన్నారు. మోసానికి గురైతే వెంటనే 1930కు కాల్ చేయాలని తెలిపారు.