News September 20, 2024
ఆ ఇద్దరికీ త్వరలో బిడ్డ!
ఇంగ్లండ్ క్రికెట్ స్వలింగ సంపర్క జంట నాట్ సివర్, కాథరిన్ తమకు బిడ్డ పుట్టబోతున్నట్లు ప్రకటించారు. క్యాథరిన్(39) గర్భం దాల్చినట్లు నాట్ ఇన్‌స్టాలో తెలిపారు. క్యాథరిన్ గత ఏడాది రిటైర్ కాగా నాట్ ఇంకా ఆడుతున్నారు. వీరిద్దరూ 2022 మేలో పెళ్లి చేసుకున్నారు. క్యాథరిన్ వయసు ఎక్కువ కావడంతో వారు ఆమె అండాల్ని భద్రపరిచారు. ఇప్పుడు వాటి ద్వారా అందుబాటులో ఉన్న పద్ధతుల్ని అనుసరించి వారు పేరెంట్స్ కాబోతున్నారు.
Similar News
News October 4, 2024
చంద్రబాబు నిజస్వరూపం బయటపడింది: జగన్
AP: తిరుమల లడ్డూ విషయంలో సీఎం చంద్రబాబు నిజస్వరూపాన్ని సుప్రీంకోర్టు ఈరోజు ఎత్తిచూపిందని వైసీపీ చీఫ్ నేత జగన్ అన్నారు. ‘ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మతవిశ్వాసాలను రాజకీయ దుర్బుద్ధితో రెచ్చగొడుతున్నారని సుప్రీంకోర్టు అర్థం చేసుకుంది. అందుకే దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దని, పొలిటికల్ డ్రామాలు చేయొద్దని గట్టిగా స్పందించింది’ అని మీడియా సమావేశంలో జగన్ వ్యాఖ్యానించారు.
News October 4, 2024
ఆ మ్యాప్‌ను తొలగించిన ఇజ్రాయెల్
జమ్మూకశ్మీర్‌లోని కొంత భాగాన్ని పాకిస్థాన్ భూభాగంగా తప్పుగా చిత్రీకరించిన భారత మ్యాప్‌ను ఇజ్రాయెల్ తొలగించింది. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో ఇజ్రాయెల్ తన అధికార వెబ్‌సైట్ నుంచి దాన్ని తొలగించింది. దీనిపై భారత్‌లో ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ మాట్లాడుతూ ‘ఇది వెబ్‌సైట్ ఎడిటర్ పొరపాటు. దీన్ని గుర్తించినందుకు ధన్యవాదాలు. మ్యాప్‌ను తొలగించాం’ అని తెలిపారు.
News October 4, 2024
పవన్ కళ్యాణ్‌పై ప్రకాశ్ రాజ్ పరోక్ష ట్వీట్
నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశిస్తూ పరోక్షంగా ట్వీట్ చేశారు. ‘సనాతన ధర్మ రక్షణలో మీరుండండి. సమాజ రక్షణలో మేముంటాం. జస్ట్ ఆస్కింగ్’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. నిన్న వారాహి డిక్లరేషన్ సందర్భంగా సనాతన ధర్మం గురించి AP డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా ‘నేనో పెద్ద సనాతన హిందువుని’ అని పవన్ ప్రకటించారు.