News April 16, 2025
ఆ ఉపాధ్యాయులకు అభినందనలు: నాగర్కర్నూల్ డీఈవో

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఈనెల 7న ప్రారంభమైన పదో తరగతి మూల్యాంకనం మంగళవారం ముగిసింది. ప్రాధాన్యతతో మూల్యాంకనం పూర్తి చేశామని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. మూల్యాంకనంలో పాల్గొన్న ఉపాధ్యాయులకు డీఈవో రమేశ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. సకాలంలో త్వరితగతిన మూల్యాంకనం పూర్తి చేసిన ఉపాధ్యాయులందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.
Similar News
News November 19, 2025
వయోవృద్ధులకు జిల్లా యంత్రాంగం అండగా ఉంది: కలెక్టర్

వయోవృద్ధులకు జిల్లా యంత్రాంగం అండగా ఉంటుందని కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అన్నారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో షామీర్పేటలోని రుద్రమదేవి ఓల్డ్ హోమ్లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వయోవృద్ధుల కోసం ప్రత్యేక సంక్షేమ చట్టం ఉందని, తల్లిదండ్రులను సరిగా చూసుకోని వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చని కలెక్టర్ స్పష్టం చేశారు.

HYD: 18 మంది సైబర్ నేరగాళ్ల అరెస్ట్

నవంబర్ 12 నుంచి 18వరకు జరిగిన ఆపరేషన్లో 11కేసులను ఛేదించి దేశ వ్యాప్తంగా 18మందిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖ్యంగా ట్రేడింగ్ మోసాలను కట్టడి చేస్తూ 15మందిని పట్టుకున్నారు. హెటెరో కంపెనీపై 250 మిలియన్ డాలర్ల భారీ ఎక్స్టోర్షన్కు ప్రయత్నం చేసిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామని సైబరాబాద్ పోలీసులు తెలిపారు. నకిలీ మెయిల్స్, ఫేక్ USFDA డాక్యూమెంట్లతో గ్యాంగ్ బెదిరించిందన్నారు.