News October 27, 2024

ఆ ఎపిక్ కార్డులు ఉంటే వెంటనే ఇచ్చేయండి: తిరుపతి కలెక్టర్

image

భోగస్ ఎపిక్ కార్డులు కలిగి ఉన్న వ్యక్తులు వెంటనే తిరుపతి అసెంబ్లీ ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారికి, నగరపాలక కమిషనర్ కు అందజేయాలని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఓ ప్రకటనలో తెలిపారు. 2021 లో భోగస్ ఎపిక్ కార్డులు ఉపయోగించి ఓటు వేయడానికి ప్రయత్నించారని చెప్పారు. ఈ ఘటనపై FIR నెంబర్ 15/2024 గా నమోదు చేసే విచారణ జరుగుతున్నట్లు చెప్పారు.ఆ ఎపిక్ కార్డులు కలిగి ఉన్నవారు శిక్ష అర్హులని చెప్పారు.

Similar News

News November 9, 2024

తిరుపతి జిల్లాలో స్కూళ్లకు సెలవు లేదు

image

తిరుపతి జిల్లాలోని అన్ని యాజమాన్య(ప్రభుత్వ, ప్రైవేటు) పాఠశాలలకు నేటి రెండో శనివారం(second satur day) సెలవు రద్దు చేసినట్లు DEO కేవీఎన్.కుమార్ వెల్లడించారు. ఇటీవల భారీ వర్షాలతో వరుస సెలవులు ఇచ్చారు. దీంతో ఇవాళ వర్కింగ్ డేగా ప్రకటించారు. అపార్, SA మోడల్ టెస్ట్ మార్కుల నమోదుకు సిబ్బంది పని చేయాలని ఆదేశించారు. మరోవైపు చిత్తూరు జిల్లాలోని స్కూళ్లలకు ఇవాళ సెలవు ఇచ్చిన విషయం తెలిసిందే.

News November 9, 2024

తిరుపతి జిల్లాలో రేపు పాఠశాలలకు హాలీడే బంద్ 

image

తిరుపతి జిల్లాలోని అన్ని యాజమాన్య (ప్రభుత్వ, ప్రైవేటు) పాఠశాలలకు రేపు పని దినంగా ప్రకటించినట్లు DEO కేవీఎన్.కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లాలో ఇదివరకే అధిక వర్షాలతో పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు తెలిపారు. దీంతోపాటూ అపార్, సెల్ఫ్ అసెస్మెంట్ మోడల్ పేపర్-I, పేపర్ II మార్కులు ఆన్‌లైన్‌లో నమోదు చేయుటకు తప్పకుండా పని చెయ్యాలని ఆదేశించారు.

News November 9, 2024

చిత్తూరు: గో షెడ్లకు జియో ట్యాగింగ్ తప్పనిసరి

image

జిల్లాలోని గోకులం షెడ్లకు జియో ట్యాగింగ్ చేపట్టాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. 2,327 షెడ్లు మంజూరు కాగా 1,911కు సాంకేతిక మంజూరు ఇచ్చామన్నారు1,377కు జియో టాకింగ్ పూర్తి చేశామని తెలిపారు. 460 పనులు గ్రౌండింగ్ అయిందని, పనులు మంజూరైన చోట టెక్నికల్ శాంక్షన్ వచ్చిన వెంటనే జియో ట్యాగింగ్ పూర్తి చేయాలన్నారు.