News November 13, 2024

ఆ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవద్దు: హైకోర్డు

image

వేమూరు మాజీ MLA మేరుగు నాగార్జున క్వాష్ పిటిషన్‌పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. గతంలో మేరుగుపై పద్మావతి అనే మహిళ అత్యాచారం కేసు పెట్టగా.. ఇటీవల కేసుతో ఎలాంటి సంబంధం లేదని స్టేట్‌మెంట్ ఇచ్చారు. అయితే కేసును ఏం చేస్తారని హైకోర్టు పోలీసులను అడిగింది. రిటర్న్ రిపోర్టు ఇవ్వాలంటూ పోలీసులకు ఏపీ హైకోర్టు ఆదేశించింది. అప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోద్దని, తదుపరి విచారణ ఈ నెల 28కి వాయిదా వేసింది.

Similar News

News November 14, 2024

విడదల రజినీ, డైమండ్ బాబుకి కీలక బాధ్యతలు

image

వైసీపీ సోషల్‌ మీడియా కార్యకర్తల కోసం జిల్లాల వారీగా బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆ పార్టీ ప్రకటించింది. అక్రమ నిర్బంధాలు, అరెస్టులకు గురవుతున్న సోషల్‌ మీడియా కార్యకర్తలకు అండగా ఉండేందుకు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ తరఫున ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. ఇందులో గుంటూరు జిల్లా నుంచి మాజీ మంత్రి విడదల రజిని, తాడికొండ నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్ డైమండ్ బాబుకు బాధ్యతలు అప్పగించారు.

News November 14, 2024

నాదెండ్ల: బస్సులు ఢీ.. విద్యార్థులకు తీవ్రగాయాలు 

image

ఆర్టీసీ బస్సు, ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొన్న సంఘటన నాదెండ్ల మండలం సాతులూరు వద్ద గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్టీసీ బస్సు గుంటూరు నుంచి బయలుదేరి సాతులూరు సమీపంలోకి రాగానే ప్రైవేట్ పాఠశాల బస్సును ఢీకొట్టింది. ఈ సంఘటనలో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వారిని వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News November 14, 2024

బాధితులల్లో మన గుంటూరుకే మొదటి స్థానం

image

రాష్ట్రవ్యాప్తంగా 2022లో నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ (NCD) ప్రజల ఆరోగ్యంపై కోసం ఇళ్ల వద్దకే వెళ్లి బీపీ, షుగర్, బీఎంఐ.. సహా పలు రకాల స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా వ్యాప్తంగా 74.48 శాతం మందికి పరీక్షలు నిర్వహించగా అత్యధికంగా జిల్లాలో 65,772 మంది షుగర్ బాధితులు ఉన్నారు. ఈ నేపథ్యంలో షుగర్ బాధితులలో గుంటూరు మొదటి స్థానంలో నిలిచింది. కాగా ఇప్పుడు ఈ సంఖ్య ఇంకా పెరిగింది.