News November 13, 2024

ఆ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవద్దు: హైకోర్డు

image

వేమూరు మాజీ MLA మేరుగు నాగార్జున క్వాష్ పిటిషన్‌పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. గతంలో మేరుగుపై పద్మావతి అనే మహిళ అత్యాచారం కేసు పెట్టగా.. ఇటీవల కేసుతో ఎలాంటి సంబంధం లేదని స్టేట్‌మెంట్ ఇచ్చారు. అయితే కేసును ఏం చేస్తారని హైకోర్టు పోలీసులను అడిగింది. రిటర్న్ రిపోర్టు ఇవ్వాలంటూ పోలీసులకు ఏపీ హైకోర్టు ఆదేశించింది. అప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోద్దని, తదుపరి విచారణ ఈ నెల 28కి వాయిదా వేసింది.

Similar News

News April 11, 2026

హైదరాబాద్-మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌వే కోసం కసరత్తు

image

హైదరాబాద్-అమరావతి-మచిలీపట్నం గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే కోసం మూడు మార్గాలను అధికారులు పరిశీలిస్తున్నారు. అమరావతి ఓఆర్ఆర్ మీదుగా 303.7 కి.మీ, విజయవాడ బైపాస్, ఓఆర్ఆర్ మీదుగా 293.19 కి.మీ, రాజధాని గుండా వెళ్లే 288.33 కి.మీ మార్గాలను అధ్యయనం చేస్తున్నారు. ఈ మూడింటిలో అనువైన ఒక మార్గాన్ని త్వరలో అధికారికంగా ఖరారు చేయనున్నారు.

News April 11, 2026

జనభాగణన శిక్షణకు హాజరవ్వకుంటే చర్యలు: కలెక్టర్

image

పీజీఆర్ఎస్ ఫిర్యాదులను 12 గంటల్లో పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ సి.ఎం సాయికాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు పై కలెక్టర్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. జనాభా గణన పై జిల్లా వ్యాప్తంగా 3 రోజుల శిక్షణ కార్యక్రమం మండలాల్లో గురువారం నుంచి ప్రారంభమైందని, శిక్షణా కార్యక్రమానికి హాజరు కాని వారి పై చర్యలు చేపట్టడతామన్నారు. రాబోయే రోజుల్లో డయేరియా ప్రబలకుండా చూడాలన్నారు.