News January 31, 2025
ఆ కారణంతోనే మాపై కేసులు: ఎంపీ మిథున్ రెడ్డి

రాజకీయ కక్షతోనే చంద్రబాబు తమపై కేసులు పెడుతున్నారని ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆరోపించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. మంగళంపేటలో 75 ఎకరాలు కొన్నామని, ఈ భూమి అటవీశాఖకు సంబంధించినది కాదని అన్నారు. తమ ఊర్లో హాస్పిటల్ నిర్మాణానికి రూ.15 కోట్ల విలువైన భూమిని ఇచ్చామని, అలాంటిది కేవలం రూ.3 కోట్ల భూమిని కబ్జా చేశామని చెప్పడం సరికాదన్నారు.
Similar News
News October 19, 2025
వనపర్తి జిల్లా నుంచి 73 లైసెన్స్ సర్వేయర్లు ఎంపిక

వనపర్తి జిల్లాలో లైసెన్స్ సర్వేయర్లుగా ఎంపికై శిక్షణ పూర్తి చేసుకున్న సర్వేయర్లకు లైసెన్స్ పంపిణీని కార్యక్రమంలో భాగంగా వనపర్తి జిల్లా నుంచి 73 మంది లైసెన్స్ సర్వేయర్లు హైదరాబాద్ బయలు దేరారు. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా HYD శిల్పకళా మాదాపూర్లో సర్వేయర్లకు లైన్స్ల పంపిణీ చేయనున్నారు. రాష్ట్ర మొత్తం 3,465 మంది లైసెన్స్ సర్వేయర్లకు లైసెన్సులు పంపిణీ చేయనున్నారు.
News October 19, 2025
విజయవాడలో నేడు సీఎం చంద్రబాబు పర్యటన

విజయవాడలో సీఎం చంద్రబాబు నేడు పర్యటించనున్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని పున్నమి ఘాట్ వద్ద ఆదివారం సాయంత్రం 6 గంటలకు జరిగే దీపావళి వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారని వెస్ట్ ఎమ్మెల్యే కార్యాలయం తెలియజేసింది. కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా హాజరుకానున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు పున్నమి ఘాట్ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
News October 19, 2025
అల్లూరి: వర్షంతో టపాసుల విక్రయాలకు అవస్థలు

అల్లూరి జిల్లాలో దీపావళి సందడి మొదలైంది. ఇప్పటికే పాడేరు, అరకు, రంపచోడవరం, రాజవొమ్మంగి తదితర ప్రాంతాల్లో టపాసుల దుకాణలు ఏర్పాటు చేశారు. కొన్నిచోట్ల వర్షాలు పడుతున్నాయి. ఈక్రమంలో టపాసులు తడిచిపోకుండా కాపాడుకోవడానికి వ్యాపారులు అవస్థలు పడుతున్నారు. మరోవైపు వర్షాల కారణంగా టపాసులు సరిగా పేలుతాయో లేదోనని కొందరు అనుమానిస్తున్నారు. ఈక్రమంలో కొన్ని చోట్ల విక్రయాలు నెమ్మదించాయి.