News March 12, 2025

ఆ కుటుంబానికి గ్రామస్థులంతా అండగా నిలిచారు

image

నార్కట్‌పల్లి మండలం చిప్పలపల్లిలో ఇటీవల అనారోగ్యంతో వలిగొండ శంకరయ్య భార్య పద్మ మరణించారు. ఈ విషాద సమయంలో గ్రామస్థులు పెద్ద మనసుతో స్పందించి, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో శంకరయ్య కుటుంబానికి రూ.1,15,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. గ్రామ పెద్దలు, స్థానికులు కలిసి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి మానసిక ఆత్మబలాన్ని ఇచ్చారు. గ్రామీణ సమాజంలో అండగా నిలిచిన ఈ ఘటన అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది.

Similar News

News March 18, 2025

NLG: సొరంగంలో కాలువల్లా పారుతున్న నీరు

image

ఎస్ఎల్బీసీ సొరంగంలో ఊట నీరు ఏమాత్రం తగ్గడం లేదు. సొరంగంలోని 13.5 కిలోమీటర్ల తర్వాత ఏర్పాటుచేసిన డీ2 ప్రాంతంలో కాలువల పారుతుండడంతో సహాయక చర్యలకు ప్రధాన అడ్డంకిగా మారుతున్నట్లు తెలుస్తోంది. నీటిని డివాటరింగ్ చేసేందుకు అధికారులు ప్రతి 2.5 కిలోమీటర్ల దూరంలో పంపింగ్ మోటార్లు ఏర్పాటు చేసి నీటిని బయటికి పంపి చర్యలు తీసుకుంటున్నప్పటికీ వరద ప్రవాహం ఎక్కడా తగ్గడం లేదని అధికారులు పేర్కొంటున్నారు.

News March 18, 2025

NLG: కారు టైర్ పగిలి రోడ్డు ప్రమాదం.. తాత, మనవడు మృతి

image

జడ్చర్ల జాతీయ రహదారిపై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరగ్గా ఇద్దరు మృతి చెందారు. చండూరుకు చెందిన శేఖర్ రెడ్డి, శ్వేత దంపతులకు ఇద్దరు కుమారులు. వీరు HYDలో ఉంటున్నారు. చిన్న కుమారుడు నిదయ్ రెడ్డి, తండ్రి వెంకట్ రెడ్డిలతో కలిసి శ్వేత HYD నుంచి జడ్చర్లకు వెళ్తున్నారు. మాచారం సమీపంలో టైరుపగిలి అవతలివైపు వస్తున్న బస్సును ఢీకొట్టగా తాత, మనవడు మృతిచెందారు. శ్వేత పరిస్థితి విషమంగా ఉంది.

News March 18, 2025

NLG: టెన్త్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి: DEO

image

మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీవరకు నిర్వహించనున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలకు 105 రెగ్యులర్ కేంద్రాలను, 3 ప్రైవేట్ కేంద్రాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ సంవత్సరం 18,666 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు.

error: Content is protected !!