News February 13, 2025

‘ఆ కేసులను త్వరితంగా పరిష్కరించాలి’

image

హిట్ & రన్ నష్ట పరిహార కేసులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వెంకటశేషమ్మ అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో రవాణా శాఖ, పోలీస్ అధికారులతో బుధవారం సమావేశం అయ్యారు. హిట్ అండ్ రన్ కేసుల విషయంలో సత్వరమే జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్‌కు పంపాలని ఆదేశించారు. నష్టపరిహారం క్లెయిమ్ దరఖాస్తులలో లోపలను గుర్తించి పరిష్కరించాలన్నారు.

Similar News

News November 18, 2025

రేపే దీపోత్సవం.. ఏర్పాట్లు పూర్తి

image

పద్మనాభంలో వేంచేసి ఉన్న శ్రీఅనంతపద్మనాభ స్వామి దీపోత్సవ కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. రేపు సాయంత్రం 5:30లకు జైగంట మోగగానే మెట్లకి ఇరువైపులా దీపాలు వెలిగించే కార్యక్రమం మొదలవుతుంది. ఆ సమయంలో భక్తులు జాగ్రత్తగా ఉండాలి.

సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న బాలకృష్ణ

image

సింహాచలం దేవస్థానంలో అప్పన్న స్వామిని సినీ నటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ దర్శించుకున్నారు. మంగళవారం సింహాచలం వచ్చిన బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీనుని ఏఈవో తిరుమల ఈశ్వరరావు, వేద పండితులు ఆలయ సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. సాయంత్రం అఖండ-2 సినిమా సాంగ్‌ను విడుదల చేయనున్నారు.