News July 27, 2024

ఆ కేసుల్లో పట్టుబడితే జైలుకే: నాగర్ కర్నూల్ SP

image

డ్రంక్ అండ్ డ్రైవ్, మైనర్లు డ్రైవింగ్ చేస్తే బండిని సీజ్ చేసి వాళ్లను జైలుకు పంపిస్తామని NGKL జిల్లా SP గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ హెచ్చరించారు. శుక్రవారం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ప్రారంభించిన ఎస్పీ డ్రంక్ అండ్ డ్రైవ్, వితౌట్ నెంబర్ ప్లేట్, మైనర్ డ్రైవింగ్‌లో పట్టుబడిన 200మందికి అవగాహన కల్పించి, ట్రాఫిక్ రూల్స్ వివరించారు. రోడ్డు ప్రమాదాలు నిలువరించడానికి ట్రాఫిక్ పోలీస్ వింగ్ ప్రారంభించామన్నారు.

Similar News

News October 11, 2024

కమిటీలు ఏర్పాటు చేయాలి: గద్వాల కలెక్టర్

image

గ్రామపంచాయతీలు మునిసిపాలిటీలో ఇందిరమ్మ ఇండ్ల పనుల పురోగతిపై పర్యవేక్షణ చేసేందుకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలని గద్వాల కలెక్టర్ సంతోష్ అడిషనల్ కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం ఆయన చాంబర్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ.. కమిటీలలో స్వయం సహాయక గ్రూప్ మహిళలను సభ్యులుగా చేర్చాలన్నారు. స్థానిక ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఇండ్ల విషయంలో లబ్ధిదారులకు అవసరమైన సహాయం అందించాలన్నారు.

News October 11, 2024

ఎమ్మెల్యేలంతా వసూల్ రాజాలే: డీకే అరుణ

image

కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా అక్రమ సంపాదనపై దృష్టిసారించి వసూల్ రాజాలుగా మారారని, ఇప్పటికే ప్రజలు గుర్తించారని MBNR ఎంపీ డీకే అరుణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ధన్వాడ BJP సభ్యత్వ నమోదులో ఆమె పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ హాయంలో కాళేశ్వరం పేరుతో దోచుకున్నారని, ఇప్పుడు రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళన పేరుతో దోచుకుంటున్నారన్నారు.హైడ్రా పేరుతో వసూలుచేసి ఢిల్లీకి సంచులు మోస్తున్నారని ఆమె ఆరోపించారు.

News October 11, 2024

MBNR: సర్పంచ్ ఎన్నికలు.. గ్రామాల్లో సందడి

image

MBNR, NGKL,GDWL, NRPT,WNP జిల్లాల్లో సర్పంచ్ ఎన్నికల సందడి మొదలైంది. ఇప్పటికే అధికారులు ఓటర్ జాబితా పనిలో నిమగ్నమవగా పోటీ చేయాలనుకునేవారు ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే తాము ఎన్నికల్లో గెలవాలంటే ఎలాంటి మేనిఫెస్టో రెడీ చేయాలనే దానిపై వ్యూహాలు రచిస్తున్నారు. ఇందుకు ప్రత్యేక చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇక మరికొందరు తమ గ్రామంలో ఓటర్ల వివరాలు తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు.