News January 11, 2025
ఆ ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి: ఎంపీ కలిశెట్టి
తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన చాలా బాధకు గురి చేసిందని ఎచ్చెర్ల టీడీపీ నాయకులు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం సాయంత్రం అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని TTD ఛైర్మన్ బి.ఆర్.నాయుడు, EO శ్యామలరావును కలిసి వినతిపత్రం ఇచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన దేవాలయాల్లో, కళ్యాణ మండపాలలో టోకెన్లను జారీ చేసే విషయాన్ని పరిశీలించాలన్నారు.
Similar News
News January 21, 2025
శ్రీకాకుళం జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా సిరిపురపు
శ్రీకాకుళం జిల్లా బీజేపీ నూతన అధ్యక్షుని ఎన్నికల ప్రక్రియ జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగింది. పార్టీ నూతన అధ్యక్షులుగా సిరిపురపు రాజేశ్వరరావు పేరును బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సెయిల్ డైరెక్టర్ కాశీ విశ్వనాథ రాజు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు, సుహాసిని ఆనంద్, పూడి తిరుపతి రావు, తదితరులు హాజరయ్యారు.
News January 21, 2025
శ్రీకాకుళం: ఈ నెల 24న సుకన్య సమృద్ధి యోజన డ్రైవ్
శ్రీకాకుళం జిల్లాలోని అన్నిపోస్ట్ ఆఫీస్‌లలో జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా ఈనెల 24వ తేదీన సుకన్య సమృద్ధియోజన మెగా మేళా నిర్వహిస్తున్నట్లు పోస్టల్ సూపరింటెండెంట్ వి.హరిబాబు తెలిపారు. 10 సంవత్సరాలోపు బాలికలు ఈ అకౌంట్ ఓపెన్ చేయడానికి అర్హులు. ఒక సం.లో కనీసం 250/- గరిష్ఠంగా 1,50,000 వరకు డిపాజిట్ చేయవచ్చు. బాలికకు 18సం. నిండిన తర్వాత విద్య, వివాహం నిమిత్తం 50% వరకు నగదును ఉపసంహరించుకోవచ్చని తెలిపారు.
News January 21, 2025
SKLM: కార్తీక్ మృతిపై మంత్రి అచ్చెన్న దిగ్భ్రాంతి
చిత్తూరు జిల్లాకు చెందిన సైనికుడు కార్తీక్ మృతి పట్ల టెక్కలి ఎమ్మెల్యే, రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం ప్రకటన విడుదల చేశారు. జమ్మూలో నిన్న జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో కార్తీక్ మృతి పట్ల మంత్రి అచ్చెన్నాయుడు సంతాపం తెలిపారు. సైనికుడు కార్తీక్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. కార్తీక్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.