News January 21, 2025
ఆ నిధులను సమాజ సేవకే వినియోగిస్తాం: ప.గో కలెక్టర్

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యత్వ నమోదు ద్వారా సేకరించిన నిధులను సమాజ సేవ కార్యక్రమాలకు ఉపయోగిస్తామని ప.గో కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రకటించారు. రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యత్వ నమోదుపై కలెక్టర్ సోమవారం సమీక్షించారు. రూ.లక్ష కంటే ఎక్కువగా సభ్యత్వ రుసుము సేకరించిన తణుకు తహశీల్దార్, తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్లను కలెక్టర్ అభినందించారు.
Similar News
News February 19, 2025
ప.గో: మడ అడవులను పరిశీలించిన కలెక్టర్

నరసాపురం మండలం దర్భరేవు, రాజులలంక గ్రామాల్లో మంగళవారం మడ అడవులను కలెక్టర్ బోటులో వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మడ అడవులను పెరగనివ్వాలని, వాటిని అక్రమంగా నరికితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సముద్ర తీర ప్రాంతం కోతకు గురికాకుండా రక్షణగా నిలుస్తున్నాయన్నారు. స్థానిక రైతులతో తాబేళ్ల సంరక్షణ, మడ అడవులు పరిరక్షణపై జిల్లా కలెక్టర్ మాట్లాడి, తగు సూచనలు చేశారు.
News February 18, 2025
ఉంగుటూరు: వివాహేతర సంబంధమే హత్యకు కారణం?

ఉంగుటూరు(M) బావాయిపాలెంలో <<15486017>>ఏసురాజు హత్యకు <<>>వివాహేతర సంబంధమే కారణంగా తెలుస్తోంది. ప్రియురాలు భర్త, మామలే ఏసు రాజుని హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. తన భార్యతో చనువుగా ఉండొద్దని ఆమె భర్త చెప్పినా వినకపోవడం, మెసేజ్‌లు చేస్తున్నాడనే కోపంతో ఏసురాజుని బావాయిపాలెం తీసుకొచ్చి చేయి నరికేశారు. అనంతరం రక్తస్రావంతో ఏసు మృతి చెందాడు. కాగా మృతుడు రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు.
News February 18, 2025
తాడేపల్లిగూడెం: 21 వేల కోళ్ల ఖననం

బర్డ్ ఫ్లూ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఎక్కడికక్కడ కోళ్ల ఫారాలను తనిఖీ చేస్తూ, అమ్మకాలపై ఆంక్షలు విధిస్తున్నారు. తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లిలోని ఓ ఫౌల్ట్రీలో అనుమానిత లక్షణాలు ఉన్న 21 వేల కోళ్లను అధికారులు ఖననం చేస్తున్నారు. పౌల్ట్రీ సమీపంలో గొయ్యి తవ్వించి వాటిని పాతిపెట్టారు. గ్రామంలో సోడియం హైపోక్లోరైడ్ పిచికారీ చేయించినట్లు కార్యదర్శి టి.రవిచంద్ తెలిపారు.