News September 11, 2024

ఆ పథకంపై అవగాహన కల్పించండి: కలెక్టర్

image

చిత్తూరు: పీఎం విశ్వకర్మ యోజన రిజిస్ట్రేషన్ కోసం లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. పథకం అమలుపై కలెక్టరేట్‌లో మంగళవారం సమీక్ష నిర్వహించారు. 18 రకాల చేతివృత్తుల వారికి ఆర్థిక సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించిందని చెప్పారు. దీనిని సద్వినియోగం చేసుకునేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. డిసెంబర్ లోపు లక్ష్యాలు చేరుకోవాలన్నారు.

Similar News

News October 30, 2025

తుఫాన్‌ను సీఎం అద్భుతంగా ఎదుర్కొన్నారు: MP

image

చిత్తూరు: మొంథా తుఫాన్‌ను సీఎం చంద్రబాబు అపార అనుభవంతో అద్భుతంగా ఎదుర్కొన్నారని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు కొనియాడారు. ముందస్తు చర్యలతో ప్రాణనష్టం నివారించగలిగామని తెలిపారు. బాధితులకు సహాయం, పునరావాస కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించడం సీఎం చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. ప్రజలకు అండగా నిలిచిన ప్రజాప్రతినిధులు, అధికారులను ఆయన అభినందించారు.

News October 30, 2025

చిత్తూరు కలెక్టర్ కీలక ఆదేశాలు

image

చిత్తూరు జిల్లాలో తుఫాను నష్టంపై నవంబర్ 5వ తేదీ లోపు నివేదికలు సిద్ధం చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. నష్ట గణన ప్రక్రియపై బుధవారం సాయంత్రం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని అధికారులతో సమీక్షించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో నివేదికలు తయారు చేయాలని సూచించారు. నష్టాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి నిధుల మంజూరుకు కృషి చేస్తామన్నారు.