News September 11, 2024
ఆ పథకంపై అవగాహన కల్పించండి: కలెక్టర్
చిత్తూరు: పీఎం విశ్వకర్మ యోజన రిజిస్ట్రేషన్ కోసం లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. పథకం అమలుపై కలెక్టరేట్‌లో మంగళవారం సమీక్ష నిర్వహించారు. 18 రకాల చేతివృత్తుల వారికి ఆర్థిక సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించిందని చెప్పారు. దీనిని సద్వినియోగం చేసుకునేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. డిసెంబర్ లోపు లక్ష్యాలు చేరుకోవాలన్నారు.
Similar News
News October 10, 2024
ప్రియుడిపై కోపంతో కళ్లీ పాలు తాగిన యువతి
ప్రియుడు మరొకరితో చనువుగా ఉండటం జీర్ణించుకోలేక ఓ యువతి కళ్లీ పాలు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. జిల్లా ఆస్పత్రి అవుట్ పోస్టు పోలీసుల కథనం మేరకు.. పుంగనూరు మండలం ఈడిగపల్లెకు చెందిన(21) ఏళ్ల యువతి ఓ బట్టల దుకాణంలో పనిచేస్తూ అక్కడ ఉన్న ఓ యువకుని ప్రేమలో పడింది. కొంతకాలం ఇద్దరూ చనువుగా ఉన్నారు. తనను కాదని అదే షాపులో పనిచేసే మరో యువతిని తన ప్రియుడు ప్రేమిస్తున్నాడని కళ్లీ పాలు తాగింది.
News October 10, 2024
వ్యాపార దిగ్గజం రతన్ టాటాకు శ్రీసిటీ ఎండీ ఘన నివాళి
గొప్ప దార్శినికతకు, భారతీయ పరిశ్రమకు, దాతృత్వానికి మారుపేరైన టాటా సన్స్ గ్రూప్ మాజీ ఛైర్మన్ రతన్ నావల్ టాటా మృతి పట్ల శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆ మహోన్నత వ్యక్తికి ఘనంగా నివాళులు అర్పిస్తూ, తరతరాలకు స్ఫూర్తినిచ్చే దార్శనికుడిని భారతదేశం కోల్పోయిందని పేర్కొన్నారు. 2019 ఏప్రిల్ 16న రతన్ టాటా శ్రీ సిటీని సందర్శించారు.
News October 10, 2024
చిత్తూరులో రూ.500 కోట్లతో మెడికల్ కాలేజ్
వెల్లూరు సీఎంసీ సంస్థ అజీమ్ ప్రేమ్ జీ ఫౌండేషన్ సహకారంతో చిత్తూరులో రూ.500 కోట్లతో కొత్త మెడికల్ కళాశాల ఏర్పాటుకు సిద్దమవుతోంది. ఇందుకు సంబంధించిన ప్రణాళికలను ఆవిష్కరించారు. ఇప్పటికే ఉన్న 120 పడకల ఆసుపత్రిని 422 పడకల ఆసుపత్రిగా అప్ గ్రేడ్ చేయడంతో పాటు మరిన్ని సౌకర్యాలు, సిబ్బంది నియామకం జరుగనుంది.