News May 10, 2024

ఆ పార్టీ నేతలు మ్యాచ్ ఫిక్సింగ్‌తో పనిచేస్తున్నారు: బాజిరెడ్డి గోవర్ధన్

image

కాంగ్రెస్, బీజేపీ పార్టీ నేతలు మ్యాచ్ ఫిక్సింగ్ తో పనిచేస్తున్నారని నిజామాబాద్ పార్లమెంట్ BRS అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. శుక్రవారం నిర్వహించిన మీట్ ద ప్రెస్ లో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్‌లు ఇద్దరిలో ఎవరైనా గెలవాలి గానీ బీఆర్‌ఎస్ మాత్రం గెలవద్దని మ్యాచ్ ఫిక్సింగ్‌తో పనిచేస్తున్నాయన్నారు. ఆ రెండు పార్టీలకు ప్రజలు పార్లమెంటు ఎన్నికల్లో కర్రు కాల్చివాత పెడతారని పేర్కొన్నారు.

Similar News

News October 17, 2025

NZB: గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

image

నిజమాబాద్‌లో గంజాయి తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు మూడవ టౌన్ ఎస్ఐ హరిబాబు తెలిపారు. రైల్వే స్టేషన్ ప్రాంతంలో పెట్రోల్ నిర్వహిస్తుండగా పెంబోలి రైల్వే ట్రాక్ వద్ద ఓ వ్యక్తి పోలీసులు చూసి పారిపోతుండగా అదుపులోకి తీసుకున్నామన్నారు. అతడి నుంచి 110 గ్రాముల గంజాయి స్వాదినపరుచుకుని రిమాండ్‌కు తరలించమన్నారు.

News October 17, 2025

NZB: ఫ్యాక్టరీలో గుట్కా తయారీ, ఇద్దరి అరెస్ట్

image

NZB శివారులో అక్రమంగా తయారు చేస్తున్న గుట్కాను CCS పోలీసులు పట్టుకున్నారు. జన్నెపల్లి రోడ్డులో ఓ ఫ్యాక్టరీలో సీసీఎస్ ఏసీపీ నాగేంద్ర చారి ఆధ్వర్యంలో గురువారం సోదాలు చేసి అక్కడ గుట్కా తయారు చేస్తున్నట్లు గుర్తించారు. గుట్కా తయారీకి సంబంధించిన సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. అసాన్, అమీర్ అనే నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఫ్యాక్టరీలో పాన్ మసాలా ముసుగులో గుట్కా తయారు చేస్తున్నారు.

News October 17, 2025

NZB: 102 వైన్స్‌లకు దరఖాస్తులు ఎన్నంటే?

image

NZB జిల్లాలోని 102 వైన్ షాప్‌లకు సంబంధించి గురువారం వరకు 687 దరఖాస్తులు వచ్చాయని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి తెలిపారు. NZB ఫరిధిలోని మొత్తం 36 వైన్ షాపుల్లో 11 షాప్లకు 234 దరఖాస్తులు, BDN- మొత్తం18 వైన్ షాప్‌లకు 168, ARMR- 25 షాప్‌లకు 135, భీంగల్-12 వైన్ షాపులకు 65, మోర్తాడ్ పరిధిలో 11 వైన్ షాపులకు 85 దరఖాస్తులు వచ్చాయని ఆయన వివరించారు.