News May 10, 2024
ఆ పార్టీ నేతలు మ్యాచ్ ఫిక్సింగ్‌తో పనిచేస్తున్నారు: బాజిరెడ్డి గోవర్ధన్

కాంగ్రెస్, బీజేపీ పార్టీ నేతలు మ్యాచ్ ఫిక్సింగ్ తో పనిచేస్తున్నారని నిజామాబాద్ పార్లమెంట్ BRS అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. శుక్రవారం నిర్వహించిన మీట్ ద ప్రెస్ లో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్‌లు ఇద్దరిలో ఎవరైనా గెలవాలి గానీ బీఆర్‌ఎస్ మాత్రం గెలవద్దని మ్యాచ్ ఫిక్సింగ్‌తో పనిచేస్తున్నాయన్నారు. ఆ రెండు పార్టీలకు ప్రజలు పార్లమెంటు ఎన్నికల్లో కర్రు కాల్చివాత పెడతారని పేర్కొన్నారు.
Similar News
News February 8, 2026
NZB: ప్రచార కార్యక్రమాలపై నిషేధం

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను పురస్కరించుకుని రాష్ట్ర ఎన్నికల సంఘం నియమావళిని అనుసరిస్తూ జిల్లాలోని NZB, BDN, ఆర్మూర్, భీమ్‌గల్ పట్టణాల్లో ఈ నెల 9న సాయంత్రం 5 గంటల నుంచి ప్రచార కార్యక్రమాలపై నిషేధం అమలులోకి వస్తుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఎన్నికలు ముగిసేంత వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని చెప్పారు. 48 గంటల సైలెన్స్ పీరియడ్‌లో బహిరంగ ఎన్నికల ప్రచారం చేయరాదన్నారు.
News February 8, 2026
NZB: బందోబస్తుతో కౌంటింగ్ హాల్‌కు తరలించాలి: కలెక్టర్

ఎన్నికల విధులు కేటాయించబడిన ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్‌ను NZB జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదివారం పరిశీలించారు. ఎంత మంది పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకున్నారని వివరాలు అడిగి తెలుసుకున్నారు. వాటిని కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు మధ్యన కౌంటింగ్ హాల్‌కు తరలించాలని ఆదేశించారు.
News February 8, 2026
NZB: ఫెసిలిటేషన్ సెంటర్‌ను సందర్శించిన కలెక్టర్

ఎన్నికల విధులు కేటాయించబడిన ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్‌ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదివారం సందర్శించారు. ఎంత మంది పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకున్నారని వివరాలు అడిగి తెలుసుకున్నారు. సెంటర్‌లో ఏర్పాట్లను అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు.


