News April 3, 2025
ఆ పోస్టులు పెడితే కఠిన చర్యలు: ఎస్పీ పి.జగదీశ్

సామాజిక మాధ్యమాల్లో కులాల మధ్య విద్వేషాలు సృష్టించే విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు, దుష్ప్రచారం, ఇతరుల మనోభావాలు దెబ్బతీసేలా పోస్టులు పెట్టేవారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ పి.జగదీశ్ హెచ్చరించారు. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్ ఇతర సోషల్ మీడియా వేదికల్లో ఇతరులను కించపరిచేలా పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.
Similar News
News April 12, 2025
అనంత జిల్లాకు 13వ స్థానం

ఇంటర్ ఫలితాల్లో అనంత జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. సెకండ్ ఇయర్లో 19,541 మంది పరీక్షలు రాయగా 15,632 మంది పాసయ్యారు. 80 శాతం పాస్ పర్సంటేజీతో అనంత జిల్లా రాష్ట్రంలోనే 13వ స్థానంలో నిలిచింది. ఫస్ట్ ఇయర్లో 22,824 మందికి 14,439 మంది పాసయ్యారు. 63 శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలో 17వ స్థానంలో జిల్లా నిలిచింది.
News April 12, 2025
రాజమండ్రి సెంట్రల్ జైలుకు గోరంట్ల మాధవ్

పోలీసుల అదుపులో ఉన్న నిందితుడిపై దాడి చేసిన హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు గుంటూరు కోర్టు రిమాండ్ విధించింది. మాధవ్‌తో పాటు మరో ఆరుగురిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో మాధవ్ అతనిపై దాడికి పాల్పడ్డ విషయం తెలిసిందే.
News April 12, 2025
నేడే రిజల్ట్.. అనంతపురం విద్యార్థుల్లో ఉత్కంఠ

ఇంటర్ ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. ఇవ్వాళ ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి. అనంతపురం జిల్లాలో ఫస్టియర్ 25,730 మంది, సెకండియర్ 22,960 మంది విద్యార్థులు ఉన్నారు. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.
☞ వే2న్యూస్ యాప్‌లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.