News March 26, 2025

ఆ ప్రకటనలకు స్పందించకండి: విజయవాడ సీపీ 

image

ట్రేడింగ్‌లో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వస్తోందని సామాజిక మాధ్యమాలలో వచ్చే ప్రకటనలు చూసి స్పందించ వద్దని విజయవాడ సీపీ రాజశేర్ బాబు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఇటీవల ఈ తరహా మోసాలు జరుగుతున్నందున ప్రజానీకం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ నేరాలకు గురైన బాధితులు వెంటనే 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని, లేదా http://CYBERCRIME.GOV.IN అధికారిక వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయవచ్చని సీపీ చెప్పారు. 

Similar News

News November 24, 2025

మెదక్: ప్రజావాణిలో ప్రజల సమస్యలు విన్న ఎస్పీ

image

మెదక్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చారు. తమ సమస్యలు, వివాదాలు, పోలీసు సంబంధిత ఇబ్బందులను వారు నేరుగా జిల్లా ఎస్పీ శ్రీనివాసరావుకు విన్నవించారు. ఎస్పీ ప్రతి ఫిర్యాదు దారునితో వ్యక్తిగతంగా మాట్లాడి, సమస్యలపై పూర్తి వివరాలు తెలుసుకున్నారు. సమస్యలను పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

News November 24, 2025

MBNR: గ్రీవెన్స్ డేలో 19 ఫిర్యాదులు: ఎస్పీ

image

మహబూబ్‌నగర్ జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో ఎస్పీ డి.జానకి మొత్తం 19 మంది అర్జీదారుల వినతులను స్వీకరించి, పరిశీలించారు. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ప్రతి ఫిర్యాదుపైనా వెంటనే స్పందించిన ఎస్పీ, సంబంధిత స్టేషన్ అధికారులకు ఫోన్ ద్వారా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News November 24, 2025

శ్రీకాకుళం: ఎస్పీ గ్రీవెన్స్‌కు 52అర్జీలు

image

శ్రీకాకుళం ఎస్పీ కార్యలయంలో సోమవారం జరిగిన మీకోసం కార్యక్రమానికి 52 ఫిర్యాదులు వచ్చాయి. వాటి పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి పేర్కొన్నారు. తన దృష్టికి వచ్చిన అర్జీలపై సంబంధిత అధికారుల నుంచి వివరణ తీసుకున్నామని చెప్పారు. వారితో ముఖాముఖి మాట్లాడి, సమస్యలను తెలుసుకొని పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని భరోసా కల్పించారు.