News March 26, 2025
ఆ ప్రకటనలకు స్పందించకండి: విజయవాడ సీపీ

ట్రేడింగ్‌లో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వస్తోందని సామాజిక మాధ్యమాలలో వచ్చే ప్రకటనలు చూసి స్పందించ వద్దని విజయవాడ సీపీ రాజశేర్ బాబు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఇటీవల ఈ తరహా మోసాలు జరుగుతున్నందున ప్రజానీకం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ నేరాలకు గురైన బాధితులు వెంటనే 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని, లేదా http://CYBERCRIME.GOV.IN అధికారిక వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయవచ్చని సీపీ చెప్పారు.
Similar News
News April 21, 2025
తమ్ముడి వివాహ నిశ్చయం కోసం వెళ్తూ..

ఉరవకొండలో ఆదివారం విషాద ఘటన జరిగింది. తమ్ముడి వివాహ నిశ్చయానికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో అక్క మృతి చెందింది. పట్టణానికి చెందిన ప్రవల్లిక తన తమ్ముడి వివాహ నిశ్చయం కోసం భర్త మల్లికార్జునతో కలిసి బైక్‌పై వజ్రకరూరు మండలం ఛాయాపురం గ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో పట్టణ శివారులోని కళ్యాణ మండపం వద్ద ఆటో ఢీకొంది. ప్రవల్లిక అక్కడికక్కడే మృతి చెందగా భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించారు.
News April 21, 2025
అరసవల్లిలో పోటేత్తిన భక్తులు..పెద్ద మొత్తంలో ఆదాయం

అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి నేడు వచ్చిన ఆదాయాన్ని ఆలయ అధికారులు వెల్లడించారు. టికెట్లు రూపేణా రూ.2,66,700- లు, పూజలు విరాళాల రూపంలో రూ.70,548, ప్రసాదాల రూపంలో రూ.1,38,320 ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో యర్రంశెట్టి భద్రాజీ తెలిపారు. ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామిని దర్శించుకున్నారని తెలిపారు.
News April 21, 2025
భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!

✓ కరకగూడెంలో అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా వ్యక్తికి తీవ్రగాయాలు ✓ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డులో చుంచుపల్లి వాసి విశ్వామిత్రకు చోటు ✓ జిల్లావ్యాప్తంగా ఈస్టర్ వేడుకలు జరుపుకున్న క్రైస్తవులు ✓ కొత్తగూడెం కలెక్టరేట్లో రేపు ప్రజావాణి రద్దు ✓ మణుగూరు రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్రగాయాలు ✓ అశ్వారావుపేటలో 463 కేజీల గంజాయి పట్టివేత ✓ ‘చండ్రుగొండలో అక్రమ మట్టి తోలకాలు’.