News March 20, 2025
ఆ ప్రాంతాల్లో 144 సెక్షన్.. అన్నీ బంద్: ఎస్పీ శ్రీనివాస్

10వ తరగతి పరీక్షల నేపథ్యంలో ఆసిఫాబాద్ జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రావు బుధవారం ప్రకటనలో తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు తెలిపారు. కేంద్రాల చుట్టుపక్కల 100 మీటర్ల పరిసర ప్రాంతాల్లో నెట్, జిరాక్స్ సెంటర్లు, ఇతర ఏ విధమైన షాపులు తెరవడానికి వీలు లేదన్నారు.
Similar News
News October 15, 2025
అనంతపురంలో ఏరోస్పేస్&ఆటోమోటివ్: లోకేశ్

AP: అనంతపురంలో రేమండ్ కంపెనీ రూ.1,000 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. ఏరోస్పేస్, ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయబోతున్నట్లు తెలిపారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.700 కోట్ల సబ్సిడీలు ఇస్తున్నట్లు తెలుస్తోంది.
News October 15, 2025
నిషేధిత జాబితా నుంచి తొలగించాలని వినతి

చౌటుప్పల్: రాచకొండ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 106ను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని రాచకొండ రైతులు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావును కోరారు. ఈ మేరకు బుధవారం వారు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. 2018లో పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేసినా, తమ భూములు అమ్ముకోకుండా గత ప్రభుత్వం నిషేధిత జాబితాలో పెట్టిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
News October 15, 2025
కలెక్టరేట్ నిర్మాణం డిసెంబరు నాటికి పూర్తి చేయాలి: కలెక్టర్

ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ నిర్మాణ పనులు డిసెంబరు నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. బుధవారం జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌తో కలిసి ఆయన కలెక్టరేట్‌ను పరిశీలించారు. ప్రజల పరిపాలనకు ఉపయోగపడే గదులన్నీ కింద ఫ్లోర్లో ఉండేలా, ఒక్కో శాఖకు కేటాయించే స్క్వేర్ ఫీట్‌ను నిర్ణయించి, గదులను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.