News February 9, 2025
ఆ ఫోన్ నంబర్లు వస్తే ఫోన్ ఎత్తకండి: సీఐ రమేష్ బాబు

ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి #90, #09ను డయల్ చేయమంటే చేయొద్దని, అలా చేస్తే మీ సిమ్‌ని వారు యాక్టివేట్ చేసుకుని నేరాలకు పాల్పడే అవకాశం ఉందని త్రీ టౌన్ సీఐ రమేష్ బాబు తెలిపారు. అట్లాగే +3, +5, +9, +2 సిరీస్‌తో వచ్చే ఫోన్ నంబర్లను అస్సలు లిఫ్ట్ చేయవద్దని సూచించారు. మిస్డ్ కాల్ వచ్చిందని ఆ నంబర్లకు ఫోన్ చేస్తే మూడు సెకన్లలో ఫోన్‌లో ఉన్న డేటాను హ్యాక్ చేస్తారని తెలిపారు.
Similar News
News December 10, 2025
మంగళగిరి ఎయిమ్స్‌లో 30 లక్షలు దాటిన వైద్య సేవలు

మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రి వైద్య సేవల్లో మరో మైలురాయిని దాటిందని అధికారులు తెలిపారు. ఔట్ పేషెంట్ సేవలు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం 30 లక్షల మందికి సేవలు అందించినట్లు బుధవారం వెల్లడించారు. గత ఆరు నెలల్లోనే 5 లక్షల ఓపీ నమోదైందన్నారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, మరింత మెరుగైన సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
News December 10, 2025
GNT: 16న కానిస్టేబుల్ అభ్యర్థులకు నియామక పత్రాలు

మంగళగిరి 6వ బెటాలియన్‌లో ఈ నెల 16న కానిస్టేబుల్ అభ్యర్థులకు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం జరగనుంది. సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరై, ఎంపికైన అభ్యర్థులకు పత్రాలు అందజేస్తారు. ఈ మేరకు జరుగుతున్న ఏర్పాట్లను బుధవారం గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్, కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అధికారులతో సమీక్షించి భద్రతా ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు.
News December 10, 2025
అమరావతిలో 30% ఎక్కువ ఆక్సిజన్!

రాజధాని అమరావతిలో పచ్చదనం అద్భుత ఫలితాలనిస్తోంది. ఇక్కడ నాటిన చెట్లు సాధారణం కంటే 30 శాతం ఎక్కువ ఆక్సిజన్‌ను విడుదల చేస్తున్నాయని ఏడీసీఎల్ డైరెక్టర్ లక్ష్మీ పార్థసారథి వెల్లడించారు. పర్యావరణ హితంగా చేపట్టిన మొక్కల పెంపకం ఇప్పుడు స్వచ్ఛమైన గాలిని అందిస్తోందన్నారు. దీనివల్ల కాలుష్యం తగ్గి, ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం లభిస్తుందని తెలిపారు. రాజధాని ఆక్సిజన్ హబ్‌గా కూడా మారుతోందని స్పష్టం చేశారు.


