News January 29, 2025
ఆ భూములు ప్రభుత్వానికి అప్పగించాలి: మంత్రి మండిపల్లి

రాయచోటిలోని స్టేట్ గెస్ట్ హౌస్‌లోబుధవారం మంత్రిమండిపల్లి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. గతంలో అటవీశాఖ మంత్రిగా పనిచేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వేల ఎకరాల పేద ప్రజల భూములు, అటవీ భూములు, అటవీ సంపదను దోచుకున్నారన్నారు. ఇవన్నీ తిరిగి ప్రభుత్వానికి అప్పగించకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.
Similar News
News November 3, 2025
తాజా వార్తలు

☛ చేవెళ్ల యాక్సిడెంట్.. 19మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి
☛ జోగి రమేశ్‌ను 10రోజుల కస్టడీకి కోరుతూ ఎక్సైజ్ శాఖ పిటిషన్.. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ రేపటికి వాయిదా వేసిన VJA కోర్టు
☛ రాష్ట్రంలోని దుర్మార్గాలకు ఆద్యుడు లోకేశ్. ఉద్దేశపూర్వకంగానే YCP నేతలపై కేసులు: సజ్జల
☛ INDతో చివరి 2 T20లకు హెడ్ దూరం
☛ TNలో SIRకు వ్యతిరేకం.. సుప్రీం కోర్టును ఆశ్రయించినట్లు డీఎంకే వెల్లడి
News November 3, 2025
నెదర్లాండ్స్‌లో మంత్రి సీతక్కకు ఘన స్వాగతం

మంత్రి సీతక్క నెదర్లాండ్స్ పర్యటన కొనసాగుతోంది. అంతర్జాతీయ మహిళా నాయకత్వ వేదిక ‘వైటల్ వాయిసెస్ గ్లోబల్ ఫెలోషిప్’సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన మంత్రికి అక్కడ ఘన స్వాగతం లభించింది. మహిళా సాధికారత, గ్రామీణ పేదరిక నిర్మూలనపై చర్చిస్తున్నారు. అక్కడ జరుగుతున్న సెమినార్లలో ఆయా దేశాల ప్రతినిధులతో సీతక్క మాట్లాడుతున్నారు. వీటికి సంబంధించిన ఫొటోలను సీతక్క తన వాట్సప్ స్టేటస్‌లో స్వయంగా పోస్ట్ చేశారు.
News November 3, 2025
పాఠశాలల్లో మౌలిక వసతుల పనులు పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్

పాఠశాలల్లో విద్యుత్, త్రాగునీరు, టాయిలెట్స్ వంటి మౌలిక వసతుల కల్పన పనులు వేగంగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో హెడ్ మాస్టర్‌లు, మున్సిపల్ కమీషనర్‌లతో ఆమె సమీక్ష నిర్వహించారు. పీఎం శ్రీ స్కూల్స్ మంజూరైన నిధులను ప్రణాళిక ప్రకారం వినియోగించి అభివృద్ధి పనులు పూర్తి చేయాలని సూచించారు.


