News September 9, 2024
ఆ మరణాలు ప్రభుత్వ హత్యలే: అమర్నాథ్

విజయవాడ వరదల్లో మరణాలు ప్రభుత్వ హత్యలేనని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. విశాఖలో ఆయన సోమవారం మాట్లాడుతూ.. ప్రచారం కోసం చంద్రబాబు జేసీబీపై తిరగారని విమర్శించారు. వర్షాలకు అనకాపల్లి జిల్లాలో పంట పొలాలు అన్ని మునిగిపోయాయని అన్నారు. ఒక్క అధికారి జిల్లాలో కనిపించడం లేదన్నారు. కోవిడ్ సమయంలో ఐదు కోట్ల మంది ప్రాణాలను జగన్ కాపాడినట్లు పేర్కొన్నారు.
Similar News
News October 27, 2025
విశాఖలో పలుచోట్ల నేలకొరుగుతున్న చెట్లు

మొంథా తుపాన్ నేపథ్యంలో వర్షంతో పాటు ఈదురు గాలులు బలంగా ఇస్తున్నాయి. నగరంలోని పలు ప్రాంతాలలో సోమవారం ఉదయం నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. రామాటాకీస్, కైలాసపురం ఎన్జీవో కాలనీ, రైల్వే క్వార్టర్స్, కంచరపాలెం తదితర ప్రాంతాలలో చెట్లు నేలకొరిగాయి. అడపా దడపా భారీ వర్షం కూడా కురుస్తోంది. సహాయక చర్యల్లో అధికార యంత్రాంగం నిమగ్నమయ్యింది.
News October 27, 2025
విశాఖ: మొంథా తుఫాన్.. జాగ్రత్తగా ఉండండి

తుఫాన్ నేపథ్యంలో విశాఖలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. దీంతో కలెక్టర్ హరేంధిర ప్రసాద్ జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. పెను గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ 0891- 2590102, 0891- 2590100 ఏర్పాటు చేశారు. సముద్ర స్నానాలు నిషేధించారు. జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు 2 రోజులు సెలవులు ప్రకటించారు.
News October 27, 2025
విశాఖలో రౌడీషీటర్లకు కౌన్సెలింగ్

విశాఖలోని పలు పోలీస్ స్టేషన్లలో రౌడీషీటర్లకు ఆదివారం కౌన్సెలింగ్ ఇచ్చారు. ఎయిర్ పోర్ట్ సీఐ ఉమా మహేశ్వరరావు రౌడీ షీటర్లకు సత్ప్రవర్తనతో మెలగాలని, నిత్యం పోలీసుల నిఘా ఉంటుందని హెచ్చరించారు. ఎటువంటి అసాంఘిక కార్యకలాపాల్లో తలదూర్చకుండా ఉండాలన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్నారు.


