News December 13, 2024

ఆ ముగ్గురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు: వనితా రాణి

image

ఏపీలో ఖాళీగా ఉన్న రాజ్యసభ సభ్యుల స్థానాలకు ముగ్గురు అభ్యర్థులు మాత్రమే పోటీలో నిలిచారని రిటర్నింగ్ అధికారి ఆర్.వనితా రాణి శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు 3 స్థానాలకు పోటీలో నిలిచిన సానా సతీశ్, బీద మస్తాన్(టీడీపీ)&ఆర్.కృష్ణయ్య(బీజేపీ) ఎన్నికయ్యారని ఆమె తెలిపారు. ఎన్నిక నిమిత్తం 6 నామినేషన్లు రాగా ఒకరి నామినేషన్ చెల్లలేదని, మిగతా ఇద్దరు ఉపసంహరించుకున్నారని వనితా రాణి చెప్పారు. 

Similar News

News February 23, 2026

కృష్ణా: ఇంటర్మీడియట్ పరీక్షలు మరికాసేపట్లో ప్రారంభం

image

జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఈ సారి ఫస్ట్ ఇయర్‌కు 24,173 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. జిల్లా వ్యాప్తంగా 63 పరీక్షా కేంద్రాల్లో ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. భద్రత, పర్యవేక్షణ కోసం 900 మంది ఇన్విజిలేటర్లు, మూడు సిట్టింగ్ స్క్వాడ్లు, మూడు ఫ్లయింగ్ స్క్వాడ్లు విధుల్లో ఉండనున్నాయి. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభం కానుంది.

News February 23, 2026

నేడు మచిలీపట్నంలో ‘మీకోసం’

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ‘మీకోసం’ కార్యక్రమం మచిలీపట్నంలోని కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10:30 గంటలకు నిర్వహించనున్నారు. ఈ మేరకు కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ప్రకటన విడుదల చేశారు. జిల్లా ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమంలో పాల్గొని సంబంధిత అధికారులకు అర్జీలు అందించి, పరిష్కారం పొందాలని సూచించారు.