News January 30, 2025
ఆ రెండు రైళ్లకు ఇక్కడ స్టాప్ ఇవ్వండి: ఎమ్మెల్యే వసంత

జి.కొండూరు: రాయనపాడు రైల్వేస్టేషనులో గోల్కొండ, శాతవాహన ఎక్స్ప్రెస్ రైళ్లకు స్టాప్ ఇవ్వాలని ఎమ్మెల్యే వసంత బుధవారం విజయవాడలో జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో అధికారులను కోరారు. రాయనపాడులో ఆ 2 రైళ్లకు స్టాప్ ఇచ్చినట్లైతే మైలవరం, తిరువూరు, జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల వారికి సౌకర్యంగా ఉంటుందన్నారు. రైల్వే శాఖ అధికారులు తక్షణమే ఈ అంశంపై దృష్టి సారించాలని ఆయన సూచించారు.
Similar News
News November 21, 2025
జాతీయ అథ్లెటిక్ పోటీలకు ‘పుల్లేటికుర్రు’ విద్యార్థిని

జాతీయ స్థాయి అథ్లెటిక్ పోటీలకు అంబాజీపేట మండలం పుల్లేటికుర్రు జడ్పీహెచ్ స్కూల్ 9వ తరగతి విద్యార్థిని చీకురుమిల్లి హర్షవర్ధని ఎంపికైనట్లు ఇన్ఛార్జ్ HM ధర్మరాజు శుక్రవారం తెలిపారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏలూరులో జరిగిన రాష్ట్ర స్థాయి అండర్-19 రన్నింగ్ పోటీలు జరిగాయన్నారు. ఈ పోటీల్లో హర్షవర్ధని 1500 మీటర్ల రన్నింగ్లో బంగారు పతకం సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైందని చెప్పారు.
News November 21, 2025
‘అరటి సాగుచేస్తున్న రైతులను ఆదుకోండి’

అనంతపురం జిల్లా వ్యాప్తంగా అరటి సాగుచేస్తున్న రైతులను వెంటనే ఆదుకోవాలని CPM నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుక్కరాయసముద్రం మండలం రెడ్డిపల్లిలో శుక్రవారం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రాంభూపాల్ రెడ్డి, జిల్లా కార్యదర్శి నల్లప్ప, తదితర నాయకులు అరటి పంటలను పరిశీలించారు. గిట్టుబాటు ధర లేక అరటి సాగుచేస్తున్న రైతులు నష్టపోతున్నారని, వెంటనే ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
News November 21, 2025
TU: 5861 విద్యార్థుల హాజరు.. నలుగురు డిబార్

టీయూ పరిధిలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్న డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో నిజామాబాద్ లో ముగ్గురు, కామారెడ్డిలో ఒకరు డిబారయ్యారని అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య చంద్రశేఖర్ తెలిపారు. 30 పరీక్ష కేంద్రాలలో 6131 మంది విద్యార్థులకు గాను 5861 మంది విద్యార్థులు హాజరు కాగా 266 మంది గైర్హాజరయ్యారు. COE సంపత్ తో కలిసి బోధన్, ఆర్మూర్, ధర్పల్లి, కామారెడ్డి పరీక్షా కేంద్రాలను ఆయన పర్యవేక్షించారు.


