News September 23, 2024
‘ఆ రెండు రోజులు పైడితల్లమ్మ దర్శనాలు ఉచితం’

పైడితల్లమ్మ ఉత్సవాలలో ప్రధాన ఘట్టాలు అక్టోబర్ 14,15 తేదీల్లో జరిగే తోల్లేళ్లు, సిరిమానోత్సవం రోజున భక్తులకు ఉచిత దర్శనం కల్పించేందుకు నిర్ణయించినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదివారం తెలిపారు. గతంలో ఈ రెండు రోజుల్లో రూ.50,రూ.100,రూ.300 చొప్పున టికెట్లు వసూలు చేసేవారు. ఈ ఏడాది మాత్రం భక్తుల తాకిడిని దృష్టిలో పెట్టుకొని పూర్తిగా ఉచిత దర్శనాలకు అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. >Share it
Similar News
News February 26, 2026
53 డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో రూ.5.30 లక్షల జరిమానా: VZM ఎస్పీ

మద్యం తాగి వాహనాలు నడిపిన 53 మంది వాహనదారులపై కేసులు నమోదు చేసి, ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.5.30 లక్షల జరిమానా విధించినట్లు SP దామోదర్ గురువారం తెలిపారు. ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి నిందితులను మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా జరిమానా విధించబడిందన్నారు. గడిచిన 3 నెలల్లో మద్యం మత్తులో వాహనాలు నడిపిన సుమారు 110 మందికి జైలు శిక్ష పడిందని ఎస్పీ వెల్లడించారు.
News February 26, 2026
VZM: ‘ఆ ఉద్యోగులకు గంట ముందుగా వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలి’

పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం మైనారిటీలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి గురువారం ఆదేశించారు. ముస్లిం ఉద్యోగులకు ప్రార్థనల కోసం పనివేళల ముగింపునకు ఒక గంట ముందుగా వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సూచించారు. మసీదులు, ముస్లిం ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు, ఫాగింగ్, బ్లీచింగ్ నిర్వహించాలన్నారు.
News February 26, 2026
చీపురుపల్లి నుంచి ప్రధానితో సీఎం వీసీ

ఈనెల 28న చీపురుపల్లి నుంచి సీఎం చంద్రబాబు ప్రధానమంత్రి మోదీ ప్రారంభించనున్న 14-15 ఏళ్ల బాలికల ఉచిత హెచ్‌పీవీ వ్యాక్సిన్ కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొననున్నారు. CHC వద్ద ప్రత్యేక వేదిక, సాంకేతిక& వైద్య ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ రాం సుందర్ రెడ్డి బుధవారం ఆదేశించారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కోరారు.


