News January 8, 2025

ఆ రోజుల్లో రూ.575కే నెల్లూరు నుంచి శ్రీలంకకు టూర్

image

ఈ రోజుల్లో ఓ ఫ్యామిలీ రెస్టారెంట్‌కు వెళ్లినా కనీసం రూ.2 వేలు దాటుతోంది. ఓ బ్రాండెడ్ షర్ట్ ధర రూ.800పైనే ఉంటోంది. అయితే రూ.500కు శ్రీలంక వెళ్లొచ్చు అంటే మీరు నమ్మగలరా.. నిజమేనండి. కాకపోతే ఇది 50 ఏళ్లనాటి మాట. 1974లో ఓ ట్రావెల్ ఏజెన్సీ నెల్లూరు నుంచి రూ.575కే ఏకంగా 15 రోజుల పాటూ శ్రీలంకకు టూర్ ప్యాకేజ్ ఆఫర్ చేసింది. ఇందుకు సంబందించి ఓ పోస్టర్ నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై మీ కామెంట్ చెప్పండి.

Similar News

News November 15, 2025

నెల్లూరు జిల్లాలోని అనధికార కట్టడాలకు భలే ఛాన్స్..

image

జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో బిల్డింగ్ ప్లాన్ లేకుండా, ప్లాన్ ఉన్నా అనుమతికి మించి కట్టిన భవనాలకు ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చిన BPS అవకాశం ఓ వరం అవుతుంది. ఈ ఏడాది ఆగస్ట్ 31 లోపు నిర్మించిన అలాంటి భవనాలను క్రమబద్ధీకరించడానికి ఇదో చక్కని అవకాశం. నెల్లూరు కార్పొరేషన్ తోపాటు కందుకూరు, కావలి, ఆత్మకూరు మున్సిపాలిటీలలో అలాంటి భవనాలు భారీగా ఉన్నాయని అంచనా. 2019 తరువాత ప్రభుత్వం మళ్లీ ఈ అవకాశం కల్పించింది.

News November 15, 2025

శ్రీకాంత్‌ను త్వరగా తీసుకురండి.. పెళ్లి చేసుకోవాలి: అరుణ

image

పెరోల్‌పై బయటికి వచ్చిన తర్వాత శ్రీకాంత్‌ని పెళ్లి చేసుకోవాలనుకున్నానని, అనవసరంగా తనను కేసుల్లో ఇరికించారని లేడీ డాన్ అరుణ పోలీసులు ఎదుట వాపోయిందట. ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన కేసులో విజయవాడలోని సూర్యారావుపేట పోలీసులు 2 రోజులు ఆమెను కస్టడీకి తీసుకున్నారు. కస్టడీలో ఆమె పోలీసులకు సహకరించలేదని సమాచారం. శ్రీకాంత్‌కు త్వరగా బెయిల్ తీసుకురావాలని, తనను పెళ్లి చేసుకోవాలని కోరినట్లు సమాచారం.

News November 15, 2025

ప్రతి 20KM కు EVఛార్జింగ్ స్టేషన్ కోసం కసరత్తు

image

జిల్లాలో EV వాహనాల ఛార్జింగ్ స్టేషన్లు పెంచేందుకు కసరత్తు మొదలైంది. జాతీయ రహదారులపై ప్రతి 20KM కు ఒక ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ సూచనకు అనుగుణంగా అధికారులు చర్యలు ప్రారంభించారు. PMఈ-డ్రైవ్ పథకం కింద ఏర్పాటు చేసే ప్రైవేట్ ఛార్జింగ్ స్టేషన్లకు 80% రాయితీ లభిస్తుంది. పబ్లిక్, ప్రైవేట్ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు కోసం ఇప్పటికే 25 స్థలాలను గుర్తించినట్లు అధికారులు చెబుతున్నారు.