News July 9, 2024

ఆ రోడ్డుకు డబ్బులు చెల్లిస్తాం: పెద్దిరెడ్డి లాయర్

image

తిరుపతి MRపల్లిలోని తన భూముల్లో నిర్మాణాలపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. భద్రత దృష్ట్యా అప్పట్లో కాంక్రీటు రోడ్డు నిర్మించామని చెప్పారు. రోడ్డు నిర్మాణ ఖర్చులు తిరుపతి కార్పొరేషన్‌కు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని పెద్దిరెడ్డి తరఫు లాయర్ కోర్టుకు వివరించారు. దీంతో పెదిరెడ్డి స్థలంలో నిర్మాణాలపై తొందరపాటు చర్యలు వద్దని ఆదేశించిన కోర్టు.. విచారణను బుధవారానికి వాయిదా వేసింది.

Similar News

News January 10, 2026

చిత్తూరు జిల్లాలో 638 విద్యుత్ సమస్యలు

image

చిత్తూరు జిల్లాలో శుక్రవారం కరెంటోళ్ల జనబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిధిలోని 40 సెక్షన్లలో అధికారులు, సిబ్బంది పర్యటించి సమస్యలను గుర్తించారు. అందులో భాగంగా 11 కేవీ ఫీడర్ల పరంగా 251 సమస్యలు, ట్రాన్స్ ఫార్మర్లవి 26, LT లైన్ 339, సర్వీసు లైన్ 22 కలిపి మొత్తం 638 సమస్యలను గుర్తించినట్లు ట్రాన్‌స్కో ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ తెలిపారు. వాటిలో 63 సమస్యలను పరిష్కారించినట్లు చెప్పారు.

News January 9, 2026

చిత్తూరు: ‘అధిక ఛార్జీలు వసూలు చేస్తే చర్యలు’

image

ప్రైవేటు బస్సు ఆపరేటర్లు ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలను వసూలు చేస్తే చర్యలు తప్పవని రవాణా ఉప కమిషనర్ నిరంజన్ రెడ్డి హెచ్చరించారు. ఆయన కార్యాలయంలో బస్సుల యాజమాన్యంతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ప్రయాణికుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ను వాయిదా, రద్దు చేయడం తగదన్నారు. ప్రతి బస్సులో సేఫ్టీ పరికరాలు ఉండాలన్నారు.

News January 9, 2026

చిత్తూరు: ‘ఒత్తిడి చేయడంతోనే హత్య’

image

వివాహ విషయమై ఒత్తిడి చేయడంతోనే కవితను హత్య చేసినట్లు గణేశ్ విచారణలో ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. ‘అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగం వచ్చిన తర్వాత ఉత్తిడి మరింత ఎక్కువ అయింది. DEC 31న యల్లమరాజుపల్లె సమీపంలో ఆమెను బైక్‌పై ఎక్కించుకొని GDనెల్లూరు వద్ద నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. రాత్రి 10.45 గంటలకు ఆమెపై దాడి చేసి హత్య చేశాడు. అనంతరం డెడ్ బాడిని నీవానది వద్ద పడేశాడు’ అని పోలీసులు తెలిపారు.