News August 20, 2024

ఆ లోపు ఇళ్లు నిర్మించకోకుంటే లోన్లు రద్దు: మంత్రి కొలుసు

image

మార్చిలోపు ఇళ్లు నిర్మించకోకుంటే లోన్లు రద్దు అవుతాయని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. మంగళవారం కంకిపాడులో గృహ నిర్మాణ సామగ్రి, నిల్వ గోదాంను ఆయన సందర్శించారు. ఈ మేరకు రికార్డులను పరిశీలించి, సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బోడె ప్రసాద్, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Similar News

News November 28, 2025

స్వమిత్వా సర్వేను వేగవంతం చేయండి: కలెక్టర్

image

జిల్లాలో స్వమిత్వా సర్వే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి స్వమిత్వా సర్వే కార్యక్రమంపై సంబంధిత జిల్లా అధికారులు, క్షేత్రాధికారులతో గూగుల్ మీట్ నిర్వహించి, గ్రామాల వారీగా పురోగతిని సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 250 గ్రామాలకు గాను 210 గ్రామాల్లో గ్రౌండ్ ట్రూతింగ్ పూర్తయిందన్నారు.

News November 28, 2025

కృష్ణా జిల్లాకు దిత్వా తుఫాన్ హెచ్చరిక.!

image

బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా కృష్ణా జిల్లాపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇటీవల సంభవించిన మొంథా తుఫాన్‌కు, దిత్వా తుఫాన్‌కు కొంత తేడా ఉంటుందని, మొంథా తుఫాన్ కారణంగా వీచిన ఈదురు గాలులు దిత్వా తుఫాన్ కారణంగా ఉండవన్నారు. కేవలం అధిక వర్షపాతం మాత్రమే నమోదవుతుందని అధికారులు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

News November 28, 2025

తుఫాన్ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

రానున్న దిత్వా తుఫాన్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డీ.కే బాలాజీ జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశమైన ఆయన తుఫాన్ ముందస్తు జాగ్రత్త చర్యలపై శుక్రవారం సమీక్షించారు. ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలని, రైతులను అప్రమత్తం చేసి కోసిన ధాన్యం తడిచి పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ విషయంలో రైతులకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలన్నారు.