News September 22, 2024

ఆ వాహనాలకు బీమా సెటిల్‌మెంట్ పూర్తి చేయండి: సీఎం

image

విజయవాడ వరదలలో వాహనాలకు జరిగిన నష్టానికి బీమా సెటిల్‌మెంట్ త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. 10 వేల వాహనాలలో 6 వేల వాహనాలకు బీమా సెటిల్‌మెంట్ పూర్తైందని అధికారులు సీఎంకు శనివారం జరిగిన సమీక్షలో తెలిపారు. మిగతా 4 వేల వాహనాలకు ఆ ప్రక్రియ పూర్తి చేయాలని, ఈ నెల 25న బాధితుల ఖాతాల్లో నష్టపరిహారం జమ చేయాలని చంద్రబాబు సూచించారు.

Similar News

News December 18, 2025

20న గుణదలలో జిల్లా జట్ల ఎంపికలు

image

కృష్ణా జిల్లా షూటింగ్ బాల్ సంఘం ఆధ్వర్యంలో డిసెంబర్ 20న గుణదలలో సీనియర్ పురుషుల, మహిళల జిల్లా జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా షూటింగ్ బాల్ సంఘం అధ్యక్షులు రాజశేఖర్ తెలిపారు. జిల్లాలో ఆసక్తి గల క్రీడాకారులు ఎవరైనా ఒరిజినల్ ఆధార్‌తో హాజరు కావాలన్నారు. ఇక్కడ ఎంపికైన క్రీడాకారులు ప్రకాశం జిల్లా కరేడులో డిసెంబర్ 25, 26 తేదీలలో జరగబోయే రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ పోటీలలో పాల్గొంటారన్నారు.

News December 18, 2025

కృష్ణా: 22కి ఉద్యోగుల గ్రీవెన్స్ మార్పు- కలెక్టర్

image

జిల్లా కలెక్టరేట్‌లో ఈనెల 19న జరగాల్సిన ఉద్యోగుల గ్రీవెన్స్ సమావేశం 22వ తేదీకి వాయిదా పడిందని కలెక్టర్ డి.కె. బాలాజీ తెలిపారు. అధికారిక కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఉద్యోగుల వినతులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, సంబంధిత శాఖల అధికారులు ఈ సమావేశానికి పూర్తి నివేదికలతో హాజరుకావాలని ఆయన ఆదేశించారు.

News December 18, 2025

రేపు కృష్ణా జిల్లా సమీక్షా మండలి సమావేశం

image

ఈనెల 19వ తేదీన కృష్ణా జిల్లా సమీక్షా మండలి సమావేశం నిర్వహించనున్నట్టు కలెక్టర్ డీకే బాలాజీ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్ అధ్యక్షతన ప్రారంభమవుతుందన్నారు. ఈ సమావేశానికి జిల్లాకు చెందిన మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు పాల్గొంటారన్నారు.