News December 12, 2024

ఆ విషయాన్ని జగన్ కూడా అంగీకరించారు: ధర్మాన

image

మాజీ మంత్రి ధర్మాన కృష్ణ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘పవన్, TDP, బీజేపీ ఏకమైనా గత ఎన్నికల్లో మాకు(YCP) 40 శాతం ఓట్లు వచ్చాయి. కూటమి ఇచ్చిన హామీలు నమ్మి పేదలు అత్యాశకు పోయి తప్పు చేశారు. మేము కార్యకర్తలను విస్మరించిన మాట కొంత వరకు నిజమే. ఇదే విషయాన్ని జగన్‌ కూడా అంగీకరించారు. భవిష్యత్తులో వారికి అండగా ఉంటూ ముందుకెళ్తాం’ అని నిన్న టెక్కలిలో జరిగిన వైసీపీ ఆఫీస్ ప్రారంభ వేడుకల్లో వ్యాఖ్యానించారు.

Similar News

News January 5, 2025

గార: ఉప్పు గెడ్డలో పడి వృద్ధురాలి మృతి

image

గార మండలం శ్రీకూర్మం పంచాయతీ జెల్లపేటకు చెందిన గండ్రేటి కృష్ణమ్మ (74) ప్రమాదవశాత్తు ఉప్పు గెడ్డలో జారి పడి మృతి చెందింది. శనివారం గార వెళ్తానని చెప్పిన కృష్ణమ్మ బందరువానిపేట వద్ద ఉన్న ఉప్పు గెడ్డలో పడి మరణించడంతో కుటుంబీకులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. స్థానికుల సమాచారంతో ఎస్ఐ జనార్దన్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని బయటకు తీసి కేసు నమోదు చేశారు.

News January 5, 2025

పాలవలసలో మొదలైన సంక్రాంతి సందడి

image

శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం పాలవలసలో గంగిరెద్దుల రాకతో సంక్రాంతి సందడి మొదలైంది. ‘అయ్యవారికి దండం పెట్టు.. అమ్మగారికి దండం పెట్టు’ అని ఎద్దుల బసవన్నలు ప్రజలను ప్రసన్నం చేసుకుంటున్నారు. అందర్నీ దీవించి వాళ్ళు ఇచ్చిన పండగ కానుకలని స్వీకరిస్తూ వెళుతున్నారు. సన్నాయి చప్పుళ్ల నడుమ గంగిరెద్దుల నృత్యం చేశాయి. ప్రతీ ఏటా ఈ గంగిరెద్దులతో రాకతో గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొంటోంది.

News January 5, 2025

సంతబొమ్మాలి: వీర జవాన్ భార్యకు కేంద్ర ప్రభుత్వం పురస్కారం

image

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం నరసాపురానికి చెందిన వీర జవాన్ ఆదినారాయణ భార్య కమలమ్మకు కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో పురస్కారం అందజేసింది. ఢిల్లీలో యుద్ధస్మారక స్తూపం వద్ద ఈ పురస్కారాన్ని అందజేశారు. 11వ అస్సాం రైఫిల్ బెటాలియన్‌కు చెందిన ఆయన ఉగ్రవాదుల ఎదురుకాల్పుల్లో వీరమరణం పొందారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఆదినారాయణకు నివాళులర్పిస్తూ భార్య కమలమ్మకు పురస్కారాన్ని అందజేశారు.