News February 21, 2025
ఆ వీడియోతో నాకు సంబంధం లేదు: వర్మ

తన ట్విటర్ అకౌంట్లో పోస్ట్ చేసిన ఓ వీడియోపై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ స్పందించారు. ‘నా సోషల్ మీడియా అకౌంట్స్‌ను గత మూడేళ్లుగా హైదరాబాద్‌కు చెందిన సోషల్ ప్లానెట్ సంస్థ నిర్వహిస్తోంది. నిన్నటి రోజున నా ట్విటర్ అకౌంట్లో పోస్ట్ చేసిన వీడియోకు, నాకు ఎటువంటి సంబంధం లేదు. వీడియో గురించి తెలిసిన వెంటనే సిబ్బందిని హెచ్చరించా. వీడియో డిలీట్ చేయించా’ అని వర్మ చెప్పారు.
Similar News
News December 4, 2025
ADB: రోడ్లే దిక్కులేవంటే.. ఎయిర్ పోర్టు ఎందుకు.?

వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాలో సరైన రోడ్లు లేక ఆదివాసీ బిడ్డలు అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు విడుస్తున్నారు. ఇప్పటి వరకు పాలించిన నాయకులు ఎవరు కూడా రోడ్ల గురించి పట్టించుకున్న పాపాన పోలేదని ప్రజలు విమర్శిస్తున్నారు. నవంబర్ నెలలో రోడ్లు లేక ముగ్గురు గర్భిణులు ప్రాణాలు విడిచారు. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లాకు ఎయిర్ పోర్టు తెచ్చి ఆదివాసీలను ఫ్లైట్స్‌లో తరలిస్తారా అని ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు.
News December 4, 2025
ములుగు: నన్ను సర్పంచ్‌గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ!

తమను సర్పంచ్‌గా గెలిపిస్తే ప్రతి ఇంటికి వైఫై, ఐదేళ్లు టీవీ ఛానల్స్ పెట్టిస్తానని హామీ ఇచ్చిన ఘటన ములుగు జిల్లా ఏటూరునాగారంలో జరిగింది. BJP బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ధనలక్ష్మి భర్త చక్రవర్తి పై హామీలతో కూడిన బాండ్ రాసిచ్చారు. పంచాయతీ ఫండ్ ప్రతి రూపాయి ఖర్చు గ్రామస్థులకు తెలియజేస్తానని పేర్కొన్నారు. గోదావరి కరకట్ట లీకేజీలు అరికడతామని, సైడు కాలువలు, కోతుల బెడద నుంచి విముక్తి కలిగిస్తామన్నారు.
News December 4, 2025
నల్గొండ: చలికాలంలో డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ

చలికాలం ప్రారంభమైన నేపథ్యంలో, జిల్లాలో దట్టంగా కమ్ముకునే పొగమంచు వలన రోడ్డు ప్రమాదాలు పెరిగే ప్రమాదం ఉందని జిల్లా ఎస్పీ శ్రీశరత్ చంద్ర పవార్ వాహనదారులను హెచ్చరించారు. పొగమంచు కారణంగా రోడ్డుపై వాహనాలు, పాదచారులు, జంతువులు, ట్రాఫిక్ సిగ్నల్స్ సరిగ్గా కనిపించకపోవడంతో పాటు, ముందున్న వాహనాల దూరాన్ని అంచనా వేయడం కష్టమవుతుందని ఎస్పీ తెలిపారు.


