News June 21, 2024

ఆ వైసీపీ కార్యాలయాలను కూల్చివేయాలి: విశాఖ కార్పొరేటర్

image

విశాఖ నగరం ఎండాడ, అనకాపల్లి జిల్లా రాజుపేటలో అనుమతులు లేకుండా నిర్మించిన వైసీపీ కార్యాలయ భవనాలను చట్టపరంగా కూల్చివేయాలని జనసేన నాయకుడు జీవీఎంసీ 22వ వార్డు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ సురేశ్‌కు వినతి పత్రం అందజేశారు. విశాఖలో కార్యాలయ స్థలానికి ఏడాదికి ఎకరానికి కేవలం రూ.1000 అద్దె చెల్లించడానికి 33ఏళ్లకు లీజుకు తీసుకున్నట్లు తెలిపారు.

Similar News

News September 14, 2024

సీఎం నివాసం వద్ద విశాఖ జిల్లా మహిళ ఆవేదన

image

విశాఖ జిల్లాలోని భీమిలికి చెందిన వైసీపీ నేత నుంచి తనకు ప్రాణహాని ఉందని భీమిలికి చెందిన వెంకటలక్ష్మి శుక్రవారం మంత్రి లోకేశ్‌కు ఫిర్యాదు చేశారు. అతని వద్ద 2021నుంచి చిట్టీలు కడుతున్నానని, ఇటీవల చిట్టీ డబ్బులు ఇవ్వాలని అడిగితే చంపేస్తానని బెదిరించినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. తమకు సీఎం చంద్రబాబు, లోకేశ్‌లే న్యాయం చేయాలని ఉండవల్లిలోని సీఎం ఇంటి వద్ద ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

News September 14, 2024

విశాఖ: ఓటరు జాబితా సవరణ.. నిధులు విడుదల

image

విశాఖ జిల్లాలో చేపడుతున్న ఓటరు జాబితా సవరణ-2025 కార్యక్రమానికి సంబంధించి ఖర్చుల కోసం రూ.17,85,820 నిధులు విడుదలయ్యాయి. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ శుక్రవారం ఈ మేరకు నిధులు విడుదల చేశారు. మెటీరియల్ కొనుగోలు చేయడంతో పాటు ఇతర అవసరాల కోసం వీటిని వాడాలని ఉత్తర్వులు పేర్కొన్నట్లు అధికారులు వివరించారు.

News September 14, 2024

విశాఖ: ఆస్ట్రేలియాలో కాకడు-2024 విన్యాసాలకు ఈ.ఎన్.సీ

image

కాకడు-2024 విన్యాసాల్లో భాగంగా ప్లీట్ కమాండర్స్ సదస్సు నిర్వహిస్తున్నారు. ఇందులో పాల్గొనేందుకు బ్లాక్ ఆఫీసర్ కమాండింగ్ ఈస్టర్న్ ప్లీట్ రియర్ అడ్మిరల్ సునీల్ మీనన్ ఆధ్వర్యంలో ఆస్ట్రేలియాలోని డార్విన్‌కు నేవీ అధికారులు వెళ్లారు. అక్కడ 28 విదేశీ నౌకాదళాల ఉన్నతాధికారులతో తూర్పు నావికాదళం అధికారులు సమావేశం నిర్వహించి వివిధ అంశాలపై చర్చించారు.