News January 10, 2025
ఆ సమాచారం తెలిస్తే ఈ నెంబరుకు ఫోన్ చేయండి: సీపీ

గంజాయి ఇతర మత్తు పదార్థాలు అమ్మే ప్రదేశాలు, వ్యక్తులు, వాహనాల గురించి పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీపీ రాజశేఖరబాబు సూచించారు. ఆ సమాచారం ఇచ్చేందుకు 1972 లేదా 112 నెంబరుకు కాల్ చేయాలని ఆయన గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. గంజాయి, మత్తు పదార్థాలకు అలవాటు పడి మీ జీవితాలు నాశనం చేసుకోవద్దని సీపీ రాజశేఖరబాబు ఈ మేరకు యువతకు సూచించారు.
Similar News
News April 24, 2025
వత్సవాయి: తమ్ముడిని చంపిన అన్న

వత్సవాయి మండలం కాకరవాయిలో దారుణం చోటు చేసుకుంది. బుధవారం రాత్రి అన్నదమ్ముల మధ్య ఘర్షణ జరగగా, అన్న కొండ ఇనుప రాడ్డుతో తమ్ముడు అర్జున్ తలపై బలంగా కొట్టాడు. తీవ్రంగా గాయపడిన అర్జున్ను విజయవాడ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. నిందితుడు కొండను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
News April 24, 2025
గుడివాడ: వైసీపీకి హనుమంతరావు రాజీనామా..?

వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావు రాజీనామా చేస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. పార్టీ ఆవిర్భావం నుంచి కీలక నేతగా ఉన్న ఆయన, కూటమి అక్రమాలపై కలెక్టర్కు వినతి కార్యక్రమంలో పాల్గొనకపోవడం చర్చనీయాంశమైంది. ఆయన బాటలోనే మరికొందరు నేతలు రాజీనామాకు సిద్ధమైనట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మండలి హనుమంతరావు నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.
News April 24, 2025
మచిలీపట్నం: నేడు జిల్లా సమీక్షా మండలి సమావేశం

కృష్ణాజిల్లాలో మండల సమీక్షా సమావేశం గురువారం మచిలీపట్నంలో జరగనుంది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వాసంశెట్టి సురేష్ అధ్యక్షతన ఉదయం 10.30ని.లకు జడ్పీ సమావేశ మందిరంలో కార్యక్రమం ప్రారంభమవుతుందని కలెక్టర్ డీకే బాలాజీ బుధవారం తెలిపారు. మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ బాలశౌరి, ప్రజా ప్రతినిథులు పాల్గొననున్నారు. అధికారులు తమ శాఖలకు చెందిన ప్రగతి నివేదికలతో హాజరు కావాలని చెప్పారు.