News December 10, 2024
ఆ సాగు ప్రోత్సాహానికి కేంద్రం తీసుకుంటున్న చర్యలేంటి?: ఎంపీ
ఖమ్మం: పామాయిల్ పంట సాగు ప్రోత్సాహానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది..? అని ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి లోక్ సభలో ప్రశ్నించారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా.. ఎంపీ మాట్లాడుతూ.. ముఖ్యంగా నీటి ఎద్దడి ఉన్న తెలంగాణ ప్రాంతంలో.. ప్రత్యేకంగా ఏమైనా కార్యక్రమాలు నిర్వహిస్తుందా..? అని లిఖిత పూర్వకంగా అడిగారు.
Similar News
News January 15, 2025
KMM: మేకపోతులు కొనేందుకు వెళ్తుండగా యాక్సిడెంట్
రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందగా మరో వ్యక్తికి గాయాలైన ఘటన పెనుబల్లి మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలిలా.. పార్థసారథిపురం గ్రామానికి చెందిన కీసర రాజు, కుంజా మహేశ్ కనుమ కావడంతో బైక్‌పై మేకపోతులు కొనేందుకు వెళుతున్నారు. ఈ క్రమంలో ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొట్టింది. రాజు అక్కడికక్కడే మృతిచెందగా.. మహేశ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
News January 15, 2025
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు ∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} పినపాకలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటన ∆} జూలూరుపాడులో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యాటన ∆} అమ్మపేటలో మాజీ సీఎం ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ ∆} ఖమ్మంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} ఎమ్మెల్యే కోరం కనకయ్య పర్యటన
News January 15, 2025
ఖమ్మం ఖిల్లాపై రోప్ వే.. హిస్టరీ ఇదే
ఖమ్మం ఖిల్లాపై రూ.30కోట్లతో ప్రభుత్వం రోప్ వే నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఖిల్లాలో ఉన్న జాఫర్ బావికి సైతం పునరుద్ధరణ పనులు చేస్తోంది. అయితే ఈ ఖిల్లాకు చారిత్రక నేపథ్యం ఉంది. మొదట దీని పేరు ఖమ్మంమెట్టు కాగా క్రీ.శ 950లో నిర్మాణానికి పునాదులు పడ్డాయి. 400 ఏళ్లపాటు కాకతీయులు, 300 ఏళ్లపాటు రెడ్డి రాజుల అధీనంలో ఉండగా అనంతరం కుతుబ్ షాహీ వంశస్థులు కోటను మెరుగుపరిచి ఖమ్మం ఖిల్లాగా పేరు మార్చారు.