News February 25, 2026

ఆ సినిమాకు సెకండ్ ఛాన్స్ వస్తే బాగుండేది: సమంత

image

తన సినిమాల్లో ‘ఈగ’కు సెకండ్ ఛాన్స్ వస్తే బాగుండేదని స్టార్ హీరోయిన్ సమంత అభిప్రాయపడ్డారు. ‘ఈగ’లో బిందు పాత్రలో మెప్పించిన సమంత ఆ సినిమా ఇప్పుడు విడుదలై ఉంటే ఇంకా బాగా ఆడేదన్నారు. తన దృష్టిలో రాజమౌళి తీసిన బెస్ట్ ఫిల్మ్ ఈగ అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఎందుకంటే మొదట ఆయనకు ఈగను ఎలా సృష్టించాలో కూడా ఐడియా లేదని.. కానీ నాని పాత్ర పోలి ఉండేలా ఈగను సృష్టించేందుకు ఆయన ఎంతో శ్రమించారని వివరించారు.

Similar News

News April 12, 2026

‘ఇంటి గుట్టు లంకకు చేటు’.. తెలుసుకోండి!

image

కుటుంబ రహస్యాలను బయటపెట్టడం వల్ల సొంతవారికే తీవ్ర నష్టం కలుగుతుందని చెప్పే సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తాం. రామాయణంలో విభీషణుడు లంక రక్షణ వ్యవస్థ గురించి రాముడికి చెబుతారు. అలాగే తన సోదరుడు రావణుడు, ఆయన పిల్లలు ఇంద్రజిత్తు, అతికాయుడి బలాల గురించి వివరిస్తారు. దీనివల్లే లంక నాశనమైంది. మన ఇంటి గోప్యతను కాపాడుకోవడం ఎంత ముఖ్యమో ఈ సామెత వివరిస్తుంది.
<<-se>>#EPICSAYINGS<<>>

దేశాల వారీగా అత్యధిక ఉష్ణోగ్రతలు

image

*అమెరికా- 56.7 డిగ్రీలు (1913)
*ట్యునీషియా- 55 (1931)
*కువైట్- 54 (2016)
*ఇరాన్- 54 (2017)
*ఇజ్రాయెల్- 54 (1942)
*ఇరాక్- 53.9 (2016)
*పాకిస్థాన్- 53.7 (2017)
*యూఏఈ- 52.1 (2002)
*భారత్- 50.6 (2016)