News April 15, 2025

ఆ 4 ప్రాంతాలను కలిపి మెగాసిటీగా అభివృద్ధి చేస్తాం: మంత్రి నారాయణ

image

మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు, విజయవాడలను కలిపి మెగాసిటీగా చేయాలనేది కూటమి ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి నారాయణ అన్నారు. మంగళవారం నారాయణ అమరావతిలో పర్యటించారు. రాజధాని నిర్మాణానికి ఇటీవల ప్రతిపాదించిన అదనపు భూసేకరణపై ఇంకా తుదినిర్ణయం తీసుకోలేదన్నారు. భూసేకరణ ద్వారా తీసుకుంటే రైతులు నష్టపోతారని.. సమీకరణ చేయాలని స్థానిక ఎమ్మెల్యేలు కోరారన్నారు.

Similar News

News December 19, 2025

HALలో 156 ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(HAL)లో 156 ఆపరేటర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది. కాంట్రాక్ట్ బేసిస్‌లో భర్తీ చేస్తారు. ఎలక్ట్రానిక్స్, ఫిట్టింగ్, గ్రిండింగ్, మెషినింగ్, టర్నింగ్ కేటగిరీల్లో ఖాళీలున్నాయి. సంబంధిత ట్రేడ్‌లో మూడేళ్ల NAC లేదా రెండేళ్ల ITI(+ NAC/NCTVT) పాసైన వారు అర్హులు. దరఖాస్తుకు చివరి తేదీ DEC 25. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
వెబ్‌సైట్: <>https://hal-india.co.in/<<>>

News December 19, 2025

పాలకొల్లు: ఐఈఎస్‌లో సత్తాచాటిన లంకలకోడేరు యువతి

image

పాలకొల్లు మండలం లంకలకోడేరుకు చెందిన కవిత బేబీ బుధవారం రాత్రి విడుదలైన యూపీఎస్సీ ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీస్ (ఐఈఎస్ ) ఫలితాల్లో 48వ ర్యాంకుతో సత్తాచాటింది. తాను తొలిసారి 2024లో యూపీఎస్సీ పరీక్షకు హాజరై విఫలమయ్యానని, పట్టుదలతో కృషి చేసి ఇప్పుడు మంచి ర్యాంకు సాధించానని కవిత పేర్కొన్నారు. టెలీకమ్యూనికేషన్ శాఖలో ఉద్యోగం సాధించాలనేది తన ఆశయమన్నారు. కవితకు గ్రామస్థులు అభినందనలు తెలిపారు.

News December 19, 2025

ధన్వాడ: తండ్రి అడుగుజాడల్లో.. కుమారుడి విజయం

image

ధన్వాడ మండలంలోని మందిపల్లిలో తండ్రి వారసత్వాన్ని కుమారుడు సురేందర్‌ రెడ్డి కొనసాగిస్తున్నారు. గతంలో ఆయన తండ్రి నరసింహారెడ్డి (1964-88) సుదీర్ఘకాలం సర్పంచ్‌గా సేవలందించారు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్న సురేందర్‌ రెడ్డి.. 1994లో ఉప సర్పంచ్‌గా, 2001లో సర్పంచ్‌గా గెలిచారు. తాజాగా 2025 ఎన్నికల్లోనూ సర్పంచ్‌గా ఎన్నికై తమ కుటుంబానికి ఓటమి లేదని నిరూపించారు.