News April 16, 2025
ఇంకా పరారీలోనే మాజీ మంత్రి కాకాణి

YCP నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని కేసులు వెంటాడుతున్నాయి. పొదలకూరు(M) వరదాపురం వద్ద రుస్తుం మైన్స్‌లో అక్రమంగా క్వార్ట్జ్ తవ్వి రూ.250కోట్లు దోచేసిన కేసులో 13 మందిపై కేసులు నమోదు చేశారు. కాకాణి A4గా ఉన్నారు. పోలీసులు నోటీసులు ఇచ్చినా విచారణకు రాలేదు. కోర్టు బెయిల్ నిరాకరించింది. దీంతో 7బృందాలతో చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లో పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారు.
Similar News
News April 18, 2025
నెల్లూరులోనూ వెయ్యేళ్ల నాటి కట్టడాలు

నెల్లూరులోని తల్పగిరి రంగనాథస్వామి దేవస్థానం అతి పురాతనమైంది. దీనిని క్రీ.శ 7, 8వ శతాబ్దంలోనే సింహపురిని ఏలిన పల్లవ రాజులు దీనిని నిర్మించారు. ఆ తర్వాత రాజరాజనరేంద్రుడు, కుళోత్తుంగ చోళుడు దీనిని అభివృద్ధి చేశారు. 95 అడుగుల పొడవుతో ఆలయ గాలిగోపురం ఉండటం విశేషం. అలాగే ఉదయగిరి కోటకు వెయ్యేళ్ల చరిత్ర ఉంది. ఇలాంటి కట్టడాలు నెల్లూరు జిల్లాలో చాలా ఉన్నాయి. నేడు World Heritage Day.
News April 18, 2025
నెల్లూరు: సచివాలయంలో రాసలీలలు..?

నెల్లూరు మినీ బైపాస్ రోడ్డును ఆనుకుని ఉన్న ఓ సచివాలయాన్ని అక్కడ పనిచేసే సిబ్బంది తమ రాసలీలలకు వాడుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆర్ఐ, మహిళా అడ్మిన్ నిర్ణీత సమయాని కంటే ముందుగానే సచివాలయానికి వచ్చి రాసలీలల్లో మునిగి తేలుతున్నారని సమాచారం. ఇటీవల వీరిద్దరిని స్థానికులు మందలించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై నెల్లూరు కార్పొరేషన్ అధికారులు రహస్యంగా విచారిస్తున్నారని సమాచారం.
News April 18, 2025
నెల్లూరు ప్రజలకు పోలీసుల కీలక సూచన

నెల్లూరు జిల్లా ప్రజలకు పోలీసులు కీలక సూచన చేశారు. వైట్ షిఫ్ట్ కారులో కొంతమంది వ్యక్తులు ఊరి వెలుపల ఉండి ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. కావలి పట్టణంలో ఇదే తరహాలో ఊరు చివర కారు పెట్టుకుని ఐదు చోట్ల దొంగతనాలు చేశారు. వైట్ షిఫ్ట్ కారు ఊరి శివారు ఏరియాలో ఉంటే వెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.