News March 20, 2024
ఇంకా పూర్తికాని నిజామాబాద్ MP అభ్యర్థి ఎంపిక..!

నిజామాబాద్ కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక కసరత్తు ఇంకా పూర్తి కాలేదు. మంగళవారం ఢిల్లీలో అధిష్ఠానం నిర్వహించిన భేటీలో ఈ విషయంలో ఏకాభిప్రాయానికి రాలేదని సమాచారం. ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిటీ రూపొందించిన జాబితాపై పార్టీ పెద్దలు రెండుమార్లు సమీక్షించారు. సామాజిక సమీకరణాలు, విజయావకాశాల నివేదికలను పరిగణనలోకి తీసుకొని అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలుపెట్టింది.
Similar News
News April 20, 2025
పోతంగల్: కొడుకు పెళ్లి.. తండ్రి మృతి

తెల్లవారితే కొడుకు పెళ్లి ఉండగా రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి చెందాడు. రుద్రూర్‌కు చెందిన నాగయ్య(52) తన కొడుకు పెళ్లి పత్రికలు ఇచ్చేందుకే శనివారం పోతంగల్‌లోని కారేగాంకు బైక్ పై వెళుతుండగా హంగర్గ ఫారం వద్ద అడ్డు వచ్చిన కుక్కను తప్పించబోయి చెట్టును ఢీకొట్టాడు. అతడు తీవ్రంగా గాయపడటంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
News April 20, 2025
నిజామాబాద్: గల్ఫ్ బాధితులను మోసం చేస్తున్న ముఠా అరెస్ట్

నందిపేట్ మండల పరిధిలోని అన్నారం గ్రామానికి చెందిన పొగరు రవి కిరణ్ ఫిర్యాదుపై నిజామాబాద్ జిల్లా సీపీ సాయి చైతన్య స్పందించారు. గల్ఫ్ బాధితులను మోసం చేస్తున్న ఆరుగురిని అరెస్టు చేసి చీటింగ్, ఇమిగ్రేషన్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఆరుగురు సభ్యులు ముఠాగా ఏర్పడి పలు గ్రామాలకు చెందిన సుమారు 80 మందిని ముఠా సభ్యులు మోసం చేసినట్లుగా గుర్తించినట్లు సీపీ పేర్కొన్నారు.
News April 20, 2025
NZB: ‘దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో వరి సాగు’

దేశంలోనే అత్యధికంగా రికార్డు స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో వరి ధాన్యం సాగు అయ్యిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. 54.89 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేయగా.. 137.10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులు వచ్చాయని వివరించారు. ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా 8,329 కొనుగోలు కేంద్రాల ద్వారా 70.13 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు వీడియో కాన్ఫరెన్సులో కలెక్టర్లకు ఆదేశించారు.