News March 5, 2026
ఇంగ్లండ్ దూకుడు.. భారత్ గెలుస్తుందా?

T20 WC సెమీస్-2లో ఇంగ్లండ్ దూకుడుగా ఆడుతోంది. భారత్ నిర్దేశించిన 254 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సిక్సర్లతో విరుచుకుపడుతోంది. వెంటవెంటనే 4 వికెట్లు కోల్పోయినా జాకబ్ బెథెల్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. 28 బంతుల్లోనే 65* పరుగులు చేశారు. విల్ జాక్స్ 19 బంతుల్లోనే 35* రన్స్ కొట్టారు. ఇంకా 42 బంతుల్లో 94 పరుగులు చేయాల్సి ఉంది. 13 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్ 160-4.
Similar News
News April 13, 2026
‘దోస్త్’ నోటిఫికేషన్ విడుదల

TG: 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించి డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ(దోస్త్) నోటిఫికేషన్ వెలువడింది. ఈనెల 15 నుంచి 3 విడతల్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయి. APR 15-మే 7 వరకు తొలి విడత, మే 15-25 వరకు రెండో విడత, మే 31-జూన్ 15 వరకు మూడో విడత రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరగనుంది. రాష్ట్రంలోని యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దోస్త్ నిర్వహిస్తారు.
News April 13, 2026
అది భర్త రక్త మాంసాలను లాక్కోవడమే.. మహిళపై హైకోర్టు ఫైర్

నెలకు రూ.లక్షకు పైగా సంపాదిస్తున్న ఓ మహిళ భర్త నుంచి భరణం కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై MP హైకోర్టు మండిపడింది. ఇది భర్త రక్తమాంసాలను లాక్కునే ప్రయత్నమేనంది. మధ్యంతర భరణం నిరాకరిస్తూ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వును సమర్థించింది. ఈ ఉదంతాన్ని షేక్స్‌పియర్ రచించిన ది మర్చంట్ ఆఫ్ వెనిస్ నాటకంతో పోల్చింది. అందులో ఓ వ్యక్తి అప్పు తీర్చనందుకు అతని శరీరం నుంచి పౌండు మాంసాన్ని వ్యాపారి డిమాండ్ చేస్తారు.
News April 13, 2026
బేబీ మసాజ్‌కు ఈ ఆయిల్స్ ఉపయోగిస్తే మంచిది

పిల్లల సంపూర్ణ వికాసానికి తల్లిపాలు ఎంత అవసరమో వారి ఆరోగ్యానికి శరీర మర్దన కూడా అంతే అవసరం. అయితే దీనికోసం ప్లాంట్ ఆయిల్, కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్, నువ్వుల నూనె, ఆవ నూనె వాడటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. శరీరం మీద ఎటువంటి రాషెస్ దద్దుర్లు ఉన్నా కూడా ఈ ఆయిల్ మసాజ్ వల్ల నివారించొచ్చంటున్నారు. బేబీకి ఆయిల్ మసాజ్ చేసేటప్పుడు చేతికి ఎలాంటి ఆభరణాలు ఉండకుండా చూసుకోవాలి.


