News July 4, 2024
ఇంజనీరింగ్లో ప్రవేశాలకు నేటి నుంచి కౌన్సెలింగ్

ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఖమ్మంలోని ఎస్ఆర్అండ్ బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాలలో గురువారం నుంచి కౌన్సెలింగ్ మొదలవుతుందని ప్రిన్సిపాల్ డాక్టర్ మొహ్మద్ జకీరుల్లా, కౌన్సెలింగ్ సెంటర్ కోఆర్డినేటర్ ఎం.సుబ్రహ్మణ్యం తెలిపారు. మొదటి విడతలో గురువారం నుంచి 12వ తేదీ వరకు స్లాట్ బుకింగ్ చేసుకునే అవకావం ఉండగా, 6వ తేదీ నుంచి 13 వరకు సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందని వెల్లడించారు.
Similar News
News December 16, 2025
ఖమ్మంలో మూడో విడత పోరుకు సిద్ధం: కలెక్టర్

ఖమ్మం జిల్లాలో ఏడు మండలాల్లోని 191 గ్రామ పంచాయతీల్లో మూడో విడత ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ఇప్పటికే 22 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 168 పంచాయతీలకు 485 మంది సర్పంచ్‌లు పోటీలో ఉన్నారు. మొత్తం 2.44 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 318 క్రిటికల్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు.
News December 16, 2025
KMM: నాడు టీడీపీ నుంచి భర్త.. నేడు కాంగ్రెస్ నుంచి భార్య

నేలకొండపల్లి మండలం అప్పల నరసింహాపురం సర్పంచ్‌గా కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసిన మన్నె రాజశ్రీ గెలుపొందారు. పదేళ్ల క్రితం, 2013లో టీడీపీ తరఫున ఇదే పంచాయతీ సర్పంచ్‌గా ఆమె భర్త మన్నె నగేష్ విజయం సాధించారు. పార్టీ మారినా, పదేళ్ల తర్వాత మళ్లీ వారి కుటుంబం నుంచే సర్పంచ్‌గా రాజశ్రీ ఎన్నిక కావడం స్థానికంగా ఆసక్తిని పెంచింది.
News December 16, 2025
63 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలలో అదనపు పోలీసు బలగాలు: సీపీ

మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 63 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించి అదనపు పోలీసు బలగాలను మోహరించినట్లు సీపీ సునీల్ దత్ తెలిపారు. సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా పెట్టామని, మద్యం, డబ్బులు, కానుకల పంపిణీపై ప్రత్యేక బృందాలు దృష్టి సారించాయన్నారు. పౌరులు సమన్వయం పాటించి నిర్భయంగా, నిష్పక్షపాతంగా ఓటు హక్కును వినియోగించుకునేలా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని పేర్కొన్నారు.


