News September 25, 2024

ఇంజనీరింగ్ పనులు కారణంగా పలు రైళ్లు రద్దు

image

గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో ఇంజినీరింగ్ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు గుంటూరు మండల రైల్వే అధికారి తెలిపారు. ఈనెల 23వ తేదీ నుంచి అక్టోబరు 7వ తేదీ వరకు గుంటూరు, సికింద్రాబాద్ (17201), సికింద్రాబాద్, గుంటూరు (12706), గుంటూరు, సికింద్రాబాద్ (12705) రైళ్లను రద్దు చేసినట్లు తెలిపారు. ఈ నెల 24వ తేదీ నుంచి అక్టోబరు 8వ తేదీ వరకు పలు రైళ్లు నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News November 6, 2025

GNT: పత్తి రైతుల సందేహాల కోసం హెల్ప్‌లైన్

image

జిల్లాలో గురువారం నుంచి CCI పత్తి కొనుగోళ్లను ప్రారంభించింది. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా మొత్తం 30 కొనుగోలు కేంద్రాలను ఓపెన్ చేశారు. పత్తిలో తేమ 8% మించకపోతే, రైతులకు పూర్తి కనీస మద్దతు ధర (MSP) లభిస్తుందని అధికారులు తెలిపారు. ఆరబెట్టిన పత్తిని మాత్రమే కేంద్రాలకు తీసుకురావాలని కోరారు. పత్తి కొనుగోళ్లకు సంబంధించిన సందేహాల నివృత్తి కోసం రైతులు 7659954529 హెల్ప్‌లైన్ నంబర్‌ సంప్రదించాలని సూచించారు.

News November 6, 2025

GNG: ఓటర్ల జాబితాపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్

image

అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటర్ల జాబితాలో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ అన్నారు. ఓటరు జాబితా పునశ్చరణపై గురువారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ను సి.ఈ.ఓ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఇంటింటా ఓటర్ల సర్వే విచారణ జరపాలన్నారు. బిఎల్‌ఓలు ఇంటింటా సర్వే చేపట్టేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. బుక్ కాల్ విత్ బిఎల్‌ఓ అవకాశాన్ని తీసుకురావడం జరిగిందన్నారు.

News November 6, 2025

సాహితీ త్రిముఖుడు డా. పాపినేని శివశంకర్

image

పాపినేని శివశంకర్ సుప్రసిద్ధ కవి, కథకులు విమర్శకులుగా ప్రసిద్ధి చెందారు. ఆయన్ను ‘సాహితీ త్రిముఖుడు’ అని పిలుస్తారు. కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం ఆయనకు లభించింది. ఆయన రాసిన కవితా సంపుటి ‘రజనీగంధ’కు 2016లో ఈ ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. శివశంకర్ గుంటూరు జిల్లా నెక్కల్లు గ్రామంలో జన్మించారు. ఆయన తాడికొండ కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా, ప్రిన్సిపల్‌గా పనిచేశారు.