News September 25, 2024
ఇంజనీరింగ్ పనులు కారణంగా పలు రైళ్లు రద్దు
గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో ఇంజినీరింగ్ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు గుంటూరు మండల రైల్వే అధికారి తెలిపారు. ఈనెల 23వ తేదీ నుంచి అక్టోబరు 7వ తేదీ వరకు గుంటూరు, సికింద్రాబాద్ (17201), సికింద్రాబాద్, గుంటూరు (12706), గుంటూరు, సికింద్రాబాద్ (12705) రైళ్లను రద్దు చేసినట్లు తెలిపారు. ఈ నెల 24వ తేదీ నుంచి అక్టోబరు 8వ తేదీ వరకు పలు రైళ్లు నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News October 11, 2024
జగన్‌కు ఆత్మ చెప్పిందేమో: లోకేశ్
రాష్ట్రానికి టీసీఎస్ ను తానే తీసుకువచ్చినట్లు జగన్మోహన్ రెడ్డికి ఆత్మ చెప్పిందేమో అని మంత్రి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. మంగళగిరి సమీపంలోని కొలనుకొండలో కియా కార్ల షోరూమ్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గతంలో కూడా చంద్రబాబునాయుడు కియా మోటార్స్‌ను ఏపీకి తీసుకువస్తే వైఎస్ రాజశేఖర్ రెడ్డి లెటర్ రాశారంటూ మాట్లాడారని విమర్శించారు.
News October 11, 2024
గుంటూరు ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు: ఎస్పీ
గుంటూరు జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులకు, సిబ్బందికి, పోలీసు కుటుంబ సభ్యులకు ఎస్పీ సతీశ్ కుమార్ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. విజయాలకు చిహ్నమైన ఈ విజయదశమి నాడు.. అన్ని రంగాల్లో అందరికి విజయం చేకూరాలని, సుఖ సంతోషాలతో ఆనందంగా దసరా పండుగను జరుపుకోవాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
News October 11, 2024
EVMలపై మాట్లాడటానికి చంద్రబాబుకు సిగ్గుందా?: మేరుగ
ఈవీఎంలపై మాట్లాడటానికి సీఎం చంద్రబాబుకు సిగ్గుందా? అని మాజీ మంత్రి మేరుగ నాగార్జున ప్రశ్నించారు. గుంటూరులో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. కేంద్రంతో కలిసి ఉన్నప్పుడు ఒకమాట, లేనప్పుడు ఇంకోమాట మాట్లాడటం ఆయనకు అలవాటన్నారు. గతంలో ఈవీఎంలపై ఆరోపణలు చంద్రబాబే చేశారని.. ఢిల్లీ వెళ్లి ఫిర్యాదులు కూడా ఇచ్చారని గుర్తు చేశారు. సంపన్న దేశాలు సైతం బ్యాలెట్ వైపు మొగ్గు చూపుతున్నాయనే విషయాన్ని గ్రహించాలని సూచించారు.