News August 2, 2024
ఇంజినీరింగ్ పనుల కారణంగా పలు రైళ్ల రద్దు
విజయవాడ డివిజన్ పరిధిలో ఇంజినీరింగ్ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేసినట్లు గుంటూరు మండల రైల్వే అధికారి తెలిపారు. ఈనెల 4 నుంచి 11వ తేదీ వరకు విజయవాడ-మాచర్ల(07781), 5 నుంచి 12వ వరకు మాచర్ల-విజయవాడ(07782) రైళ్లను పూర్తిగా రద్దు చేసినట్లు పేర్కొన్నారు. తెనాలి-విజయవాడ-కాజీపేట మీదుగా వెళ్లే మరికొన్ని రైళ్లు గుంటూరు-పగిడి పల్లి మీదుగా మళ్లింపు మార్గంలో నడుస్తాయన్నారు.
Similar News
News October 4, 2024
అమరావతి: సీఎం చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇదే
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం షెడ్యూల్‌ను సీఎం కార్యాలయం విడుదల చేసింది. సీఎం చంద్రబాబు నేడు ఉండవల్లిలోని నివాసంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువస్తున్న ఎంఎస్ఎంఈ నూతన పాలసీపై సమీక్ష చేస్తారు. అనంతరం ఆదాయ ఆర్జన శాఖలపై సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం ధాన్యం సేకరణపై సీఎం సమీక్ష చేస్తారని సీఎం కార్యాలయం తెలియజేసింది.
News October 4, 2024
మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు మరో షాక్
బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు మరో షాక్ తగిలింది. గతంలో వెలగపూడిలో జరిగిన ఓ మహిళ మర్డర్ కేసుకు సంబంధించి తుళ్లూరు పోలీసులు పీటీ వారెంట్ కోర్టులో దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం పీటీ వారెంట్‌కు న్యాయస్థానం అనుమతిచ్చింది. ఈ నెల 7వ తేదీన తుళ్లూరు పోలీసులు గుంటూరు జైలు నుంచి మంగళగిరి కోర్టులో నందిగం సురేశ్‌ను హాజరు పరచనున్నారు. దీంతో సురేశ్‌కు గట్టి షాక్ తగిలినట్లు అయింది.
News October 4, 2024
యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి: ఎస్పీ సతీశ్
ప్రజలు, పోలీసులు మధ్య స్నేహపూరిత వాతావరణం నెలకొల్పాలనే ఉద్దేశంతో వారధి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎస్పీ సతీశ్ కుమార్ తెలిపారు. చేబ్రోలు మండలంలోని గొడవర్రు పంచాయతీ కార్యాలయం వద్ద గురువారం రాత్రి ఆయన వారధి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. గ్రామాల్లో ప్రజలంతా కలిసి మెలసి ఉంటే ఎటువంటి వివాదాలకు తావుండదన్నారు. అనంతరం యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు.