News February 2, 2025

ఇంటర్నేషనల్ క్రికెట్ టోర్నీకి సిద్దిపేట విద్యార్థులు

image

దుబాయ్‌లో ఫిబ్రవరి 2 నుంచి జరగనున్న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ టోర్నీ(U-19)కి సిద్దిపేటకు చెందిన పవనసుత హనుమాన్, లక్ష్మి మణికాంత్ ఎంపిక అయ్యారు. ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులు, క్రికెట్ అకాడమీ కోచ్ ముత్యాల ఆనంద్‌ను శనివారం మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. టోర్నమెంట్‌లో విజయాలను సాధించాలన్నారు.

Similar News

News November 12, 2025

వనపర్తి: లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి: రజని

image

వనపర్తిలో జరగనున్న స్పెషల్ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి.రజని అన్నారు. బుధవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో ఆమె సమావేశం నిర్వహించారు. రాజీ చేసుకోదగ్గ క్రిమినల్, సివిల్, చెక్ బౌన్స్, గృహ హింస చట్టాల కింద నమోదైన కేసులు, ప్రమాద బీమా క్లెయిమ్ పెండింగ్ కేసులను ఈ అదాలత్‌లో పరిష్కరించుకోవచ్చని ఆమె తెలిపారు.

News November 12, 2025

పేదలందరికీ సొంతింటి కల నిజం చేయాలి: కలెక్టర్

image

మచిలీపట్నంలో పేదలందరికీ సొంతింటి కల నెరవేర్చాలని కలెక్టర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు. చింతగుంటపాలెంలో పీఎంఏవై 1.0 పథక గృహాలను ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావుతో కలిసి ప్రారంభించారు. అనంతరం పీఎంఏవై 2.0 గృహ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. జిల్లాలో 6,708 గృహాలు, మచిలీపట్నం నియోజకవర్గంలో 1,101 గృహాలు పూర్తయ్యాయని తెలిపారు. కొత్త లబ్ధిదారులు నవంబర్ చివరి వరకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.

News November 12, 2025

కరీంనగర్: ఏసీబీ రైడ్‌లో నమోదైన కేసుల వివరాలు

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 2025లో ఇప్పటి వరకు నమోదు చేసిన కేసుల వివరాలను ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ వెల్లడించారు. రెవెన్యూ-8, పంచాయితీ రాజ్-6, రిజిస్ట్రేషన్-3, ఖజానా-3, మున్సిపల్-3, అగ్రికల్చర్-3, ఔషధ విభాగం-3, ఆర్టీఏ-3, పోలీస్-1 రెడ్ హ్యాండెడ్‌గో పట్టుకున్నామన్నారు. 30 మందిని అరెస్టు చేసి కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.