News March 27, 2025
ఇంటర్నేషనల్ గేమ్స్‌కు మందమర్రి వాసి

ఈ నెల 16 నుంచి 23 వరకు గోవాలో జరిగిన ఆలిండియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పోటీల్లో మందమర్రికి చెందిన పళ్లెం రాజలింగు సత్తా చాటారు. 75 ఏళ్ల విభాగంలో సింగిల్స్, డబుల్స్‌లో రెండు కాంస్య పతకాలు సాధించి అంతర్జాతీయ మాస్టర్స్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా రాజలింగును బుధవారం జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ముఖేష్ గౌడ్, సుధాకర్ అభినందించారు.
Similar News
News November 20, 2025
సిద్దిపేట: అనుమానాస్పద స్థితిలో యువతి ఆత్మహత్య

ప్రేమ వివాహం చేసుకున్న యువతి అనుమానాస్పద స్థితిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం అలిరాజిపేట బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. 5 నెలల క్రితం గజ్వేల్ మండలం చిన్న ఆరేపల్లికి చెందిన యువతి సదా అఫ్రీన్ (21), అలిరాజపేట గ్రామానికి చెందిన ఫరీద్ (22) అనే యువకుడు ఇద్దరు డిగ్రీ చదువుకున్న రోజుల్లో ఒకరినొకరు ప్రేమించుకుంన్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
News November 20, 2025
మాజీ సైనికులకు గుడ్ న్యూస్.. 28న జాబ్ మేళా

సైన్యంలో పనిచేసి పదవీ విరమణ చేసిన మాజీ సైనికోద్యోగులకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎయిర్ ఫోర్స్ అధికారులు తెలిపారు. ఈ నెల 28వ తేదీన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగులకు ఈ మేళా ఉంటుందన్నారు. వివిధ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు రక్షణ పౌర సంబంధాల అధికారి హరినాయక్ తెలిపారు. ఆసక్తిగల వారు www.dgrindia.gov.inలో పేరు నమోదు చేసుకోవాలని సూచించారు.
News November 20, 2025
మరోసారి అతిరథ మహారథులతో మెరిసిపోనున్న నగరం

భారతీయ కళా మహోత్సవం సెకండ్ ఎడిషన్‌కు రాష్ట్రపతి నిలయం వేదికకానుంది. 22- 30వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ఈ మహోత్సవ్‌లో పశ్చిమ రాష్ట్రాలైన మహరాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, గోవాలతో పాటు డామన్& డయ్యూ, దాద్రానగర్ హవేలీకి చెందిన ప్రదర్శనలు ఉంటాయి. ఆయా రాష్ట్రాలకు చెందిన వందలాది మంది కళాకారులు HYD రానున్నారు. కాగా, రేపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించనున్నారు.


