News November 28, 2024

ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి: కలెక్టర్

image

ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా చర్యలు తీసుకోవాలని కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ప్రభుత్వ, ఎయిడెడ్ ఇంటర్మీడియట్ కళాశాలల ప్రిన్సిపల్‌లను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఇంటర్మీడియట్ విద్యార్థుల ఉత్తీర్ణతా శాతం పెంపు పై ప్రభుత్వ, ఎయిడెడ్ ఇంటర్మీడియట్ కళాశాలల ప్రిన్సిపల్ లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

Similar News

News December 27, 2025

వడ్డే తులసి కుమార్‌పై జిల్లా బహిష్కరణ

image

చట్టవిరుద్ధ కార్యకలాపాలకు అలవాటుపడిన వడ్డే తులసి కుమార్‌పై జిల్లా బహిష్కరణ ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ సిరి తెలిపారు. ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీషీట్ కలిగిన ఇతడిపై హత్య, దోపిడీ, SC–ST కేసులు సహా పలు నేరాలు నమోదయ్యాయన్నారు. ఇప్పటివరకు ముగ్గురిపై జిల్లా బహిష్కరణ ఉత్తర్వులు జారీ అయ్యాయని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే బహిష్కరణ తప్పదన్నారు.

News December 27, 2025

ఉగాది లోపు పెండింగ్ ఇళ్లు పూర్తి చేయాలి: కలెక్టర్

image

జిల్లాలో ఆప్షన్–3 కింద నిర్మాణంలో ఉన్న 10,034 ఇళ్లలో పెండింగ్‌లో ఉన్న 6వేల ఇళ్లను ఉగాది నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సిరి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో హౌసింగ్ పనుల పురోగతిపై కాంట్రాక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు 4,794 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని, 2,522 ఇళ్లలో లోపాలు గుర్తించామని తెలిపారు. వాటిలో 868 ఇళ్ల లోపాలు సరిచేశామని, మిగిలినవన్నీ వారంలోపు పూర్తి చేయాలన్నారు.

News December 27, 2025

కర్నూలు జిల్లాలో డిసెంబర్ 31న పెన్షన్ పంపిణీ.!

image

జనవరి 1, 2026న పంపిణీ చేయాల్సిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ముందుగానే డిసెంబర్ 31వ తేదీన వందశాతం లబ్ధిదారులకు అందజేయాలని కర్నూలు జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఎంపీడీఓలు, మునిసిపల్ కమిషనర్లు, పెన్షన్ పంపిణీ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. డిసెంబర్ 30న పెన్షన్ మొత్తాన్ని డ్రాచేసి సేఫ్ కస్టడీలో ఉంచుకుని, 31 ఉదయం 6.30 గంటల నుంచే ఇంటింటికీ వెళ్లి పెన్షన్లను పంపిణీ చేయాలని తెలిపారు.