News March 16, 2025

ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి: కలెక్టర్

image

ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని ఏపీ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్, జిల్లా ప్రత్యేక అధికారి కృతికా శుక్లా తెలిపారు. బాపట్ల పట్టణం బాపట్ల జూనియర్ కళాశాలలోని పరీక్షా కేంద్రాన్ని జిల్లా ప్రత్యేక అధికారి, జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షల తీరు, పరీక్షా కేంద్రంలో వనరులను ఆమె పరిశీలించారు.

Similar News

News January 9, 2026

గండికోట ఉత్సవాలు.. నేడు కడపలో బైక్ ర్యాలీ

image

గండికోట ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా కడపలో శుక్రవారం భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తామని కలెక్టర్ శ్రీధర్ వెల్లడించారు. రాజీవ్ మార్క్ సర్కిల్ వద్ద మధ్యాహ్నం 3.30 గంటలకు ర్యాలీ ప్రారంభమై కలెక్టర్ ఆఫీస్, ఎర్రముక్కపల్లి సర్కిల్, ఐటీఐ బిల్ట్ సర్కిల్, వినాయక నగర్ సర్కిల్, అల్మాస్పేట్ మాసాపేట సర్కిల్, అన్నమయ్య సర్కిల్, అప్సర హాల్ మీదుగా ఆర్టీసీ బస్టాండ్ వరకు జరుగుతుంది.

News January 9, 2026

TODAY HEADLINES

image

✦ పొదుపు సంఘాలకు త్వరలో ఆన్‌లైన్‌లో రుణాలు: AP CM CBN
✦ ఉపాధి హామీ పథకం పేరు మార్పు వెనుక కార్పొరేట్ కుట్ర: TG CM రేవంత్
✦ అమరావతిలో రెండో దశ భూ సమీకరణ ఎందుకు: YS జగన్
✦ అశ్లీల కంటెంట్ వివాదం.. గ్రోక్ నివేదికపై కేంద్రం అసంతృప్తి!
✦ TG: ఫిబ్రవరి 3న మున్సిపల్ ఎన్నికలు: రాంచందర్ రావు
✦ తెలంగాణలో ‘రాజాసాబ్’ సినిమా ప్రీమియర్లపై గందరగోళం
✦ తిలక్ వర్మకు సర్జరీ.. NZతో తొలి 3 టీ20లకు దూరం

News January 9, 2026

ప్రభాస్ ‘రాజాసాబ్’ మూవీకి షాక్

image

తెలంగాణలో ‘రాజాసాబ్’ సినిమా విషయంలో గందరగోళం కొనసాగుతూనే ఉంది. ప్రీమియర్స్ ఆలస్యం కావడంతో ఇప్పటికే ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరో షాక్ ఇచ్చింది. ‘రాజాసాబ్’ టికెట్ ధరల పెంపు కోసం నిర్మాతలు చేసిన అభ్యర్థనను తిరస్కరించింది. దీంతో థియేటర్ల యాజమాన్యాలు సాధారణ ధరలకే టికెట్ల బుకింగ్ ప్రారంభించాయి.