News February 14, 2025

ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలకు 90 మంది గైర్హాజర్

image

జనగామ జిల్లాలో గురువారం జరిగిన ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం ప్రాక్టికల్ పరీక్షలకు 90 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని డీఐఈఓ జితేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి సెషన్‌లో 644 మంది విద్యార్థులకు గాను 577 మంది హాజరయ్యారని, రెండో సెషన్‌లో జరిగిన పరీక్షకు 492 మంది విద్యార్థులకు 469 మంది విద్యార్థులు హాజరైనట్లు వెల్లడించారు.

Similar News

News December 1, 2025

NZB: సర్పంచి టు మినిస్టర్

image

కమ్మర్‌పల్లి మండలం చౌట్‌పల్లికి చెందిన ఏలేటి మహిపాల్ రెడ్డి 1981లో కోనాపూర్ సర్పంచిగా గెలిచారు. అనంతరం ఆయన భీమ్‌గల్ పంచాయతీ సమితి అధ్యక్ష పదవిని దక్కించుకున్నారు. 1983 ఎన్నికల్లో TDP నుంచి ఆర్మూర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 1985లో మరోసారి ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఎన్టీఆర్ హయంలో మంత్రివర్గంలో చోటుదక్కించుకున్నారు. అటవీ శాఖ మంత్రిగా పని చేశారు.

News December 1, 2025

6న చిత్తూరు జడ్పీ సర్వసభ్య సమావేశం

image

చిత్తూరు జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈనెల 6న నిర్వహించనున్నట్లు ఛైర్మన్ శ్రీనివాసులు, సీఈవో రవికుమార్ నాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉదయం 10.30 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని చెప్పారు. ఉమ్మడి చిత్తూరులోని ఆయా శాఖల జిల్లా అధికారులు అజెండా నివేదికలను అందజేయాలని సూచించారు.

News December 1, 2025

నల్గొండ జిల్లాలో 1,950 సర్పంచ్‌ల నామినేషన్ల ఆమోదం

image

నల్గొండ జిల్లాలో మొదటి దశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. ఈ జిల్లా పరిధిలోని 318 సర్పంచ్ అభ్యర్థుల స్థానాలకు గాను దాఖలైన నామినేషన్లలో 1,950 మంది సర్పంచ్ నామినేషన్లు ఆమోదించామని ఎన్నికల అధికారి అమిత్ నారాయణ తెలిపారు. ​అదే విధంగా 2,870 వార్డు సభ్యుల స్థానాలకు దాఖలైన నామినేషన్లలో 7,893 మంది వార్డు సభ్యుల నామినేషన్లు ఆమోదించామని ఆయన వెల్లడించారు.